Covid19 Cases Updates in India: కరోనా మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 5 వేల 880 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో భారత్ లో మెుత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 35 వేలు దాటింది. మహమ్మారి సోకి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 523 కరోనా కేసులు పెరిగాయి.
దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో నలుగురు, కేరళలో ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని అన్నీ రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశంలో ఇప్పటి వరకు 220.66 కోట్ల మందికి టీకా డోసులు పంపిణీ చేశారు.
మరోవైపు, కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఆస్పత్రుల్లోని సౌకర్యాలపై ఇవాళ, రేపు మాక్ డ్రిల్ చేయనున్నారు. ఈ డ్రిల్ లో వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల సంఖ్య, పడకల సామర్థ్యం, ఐసోలేషన్, ఆక్సిజన్ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్ వివరాలను సేకరించనున్నారు.
అంతేకాకుండా కొవిడ్ పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు (ఎన్-95) సంఖయ్ వంటి అంశాలను గుర్తించనున్నారు. తాజాగా హర్యానాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో జరిగిన మాక్ డ్రిల్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొన్నారు.
Also Read: Maharashtra: ఆలయంలో వందేళ్ల నాటి చెట్టు కూలి... ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి