గువహటి : కరోనావైరస్ పాజిటివ్ పేషెంట్స్ నుండి వారికి వైద్య సహాయం, సేవ చేస్తోన్న మరొకరికి ఆ వైరస్ సోకకుండా ఉండేందుకు గువహటిలోని ఐఐటి విద్యార్థులు ఓ వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చారు. ఐసోలేషన్ వార్డులలో కరోనావైరస్ రోగులకు ఆహారం, మెడిసిన్ అందించే సమయంలో మనుషులు ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది కనుక ఆ పనిని చేసేందుకు రోబోలను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే రెండు రకాల రోబోలను సైతం సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఐసోలేషన్ వార్డులలో చికిత్స తీసుకుంటున్న కరోనావైరస్ సోకిన రోగులకు ఈ రోబోల సహాయంతో ఆహారం, మెడిసిన్ సరఫరా చేసే దిశగా ఐఐటీ గువహటి విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారు.
Read also : శ్రీరామ నవమి గురించి మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే!!
ఐఐటి గౌహతిలోని మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ప్రయోగంలో పాల్గొంటున్నారు. ఈ ప్రయోగంపై విద్యార్థులు మాట్లాడుతూ.. రెండు రోబోలలో ఒకటి ఆహారం, మెడిసిన్ సప్లై చేసేందుకు ఉపయోగపడగా.. మరొకటి ఆస్పత్రిలో చికిత్స అనంతరం మిగిలిన వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగపడనుందని తెలిపారు. ఆస్పత్రిలోని అవసరాలకు అనుగుణంగా రోబోలను ప్రోగ్రామింగ్ చేయనున్నట్టు విద్యార్థులు వెల్లడించారు.
Read also : 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు
మరో రెండు వారాల్లో రెండు రకాల రోబోలు సిద్ధమవుతాయని.. ఆ తర్వాత ప్రమాణాల ప్రకారం వాటి పనితీరును పరిశీలించేందుకు అవసరమైన పరిశోధనలు పూర్తి చేసి అనుమతులు పొందిన అనంతరం ఆస్పత్రులలో ఈ రోబోలు అందుబాటులోకి వస్తాయని విద్యార్థులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..