Helicopter from Mumbai to Hyderabad crasher in pune: కొన్నిరోజులుగా విమాన ప్రమాదాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. దేశాల ముఖ్య నేతలు, వీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లలో సైతం సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతో మంది దేశాధి నేతలు, రాజకీయ నాయకులు, ఆర్మీకి చెందిన ముఖ్య అధికారులు సైతం గతంలో అనేక ప్రమాదాలలో తమ ప్రాణాలు సైతం కోల్పోయారు.
కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురికి గాయాలు
మహారాష్ట్ర - ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పుణే జిల్లాలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది.
హెలికాప్టర్‌లో ఉన్న పైలట్ సహా నలుగురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు pic.twitter.com/mevrPBcRmO
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024
ఈ క్రమంలో..చాలా మంది విమానాలలో ప్రయాణించాలంటే ఒకింత ఆందోళనలకు గురౌతున్నారు. అంతేకాకుండా.. కొన్నిసార్లు ప్రైవేటు జెట్ విమానాలు సైతం ప్రమాదాలకు గురౌతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, జరిగిన ప్రమాదం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మహారాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ బయలుదేరిన ఒక హెలికాప్టర్ మార్గమధ్యంలో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో ముంబై నుంచి హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. అయితే.. హెలికాప్టర్ లో ఏలాంటి లోపాలు సంభవించాయో కానీ.. పూణే వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపొయింది. ఈ ఘటన జరిగినప్పుడు.. హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే దగ్గరలోని గ్రామస్తులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ హెలికాప్టర్ ఘటన..పూణేకు సమీపంలోని.. పౌద్ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ఒక్కసారిగా నెలకు ల్యాండ్ అయి ప్రయాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైదయ సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై.. పూణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వివరాలు వెల్లడించారు. పూణెలోని పౌద్ సమీపంలో ఒక ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయినట్లు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తోందని.. ఇందులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
గ్లోబల్ హెక్ట్రా కంపెనీకి చెందిన ఏడబ్ల్యూ 139 హెలికాప్టర్ ముల్షి తాలూకాలోని కొండవాడే గ్రామంలో ఒక్కసారిగా కుప్పకూలీపోయింది. ఈ ఘటనలో కెప్టెన్ ఆనంద్ తీవ్రంగా గాయపడగా.. దిర్ భాటియా, అమర్‌దీప్ సింగ్, ఎస్పీ రామ్‌లకు స్వల్ప గాయాలయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఆనంద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తుందని అక్కడి అధికారులు ఒక ప్రకటలో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook