BREAKING: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) ఇక లేరు.   

Last Updated : Aug 31, 2020, 06:28 PM IST
    • భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) ఇక లేరు.
    • గత కొంత కాలంగా ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండే రిఫరెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించిననట్టు ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ ( Pranab Mukherjee's son Abhijit Mukherjee ) ట్విటర్ ద్వారా సమాచారం అందించారు.
BREAKING: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ( Former president Pranab Mukherjee ) ఇకలేరు. గత కొంత కాలంగా ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండే రిఫరెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించిననట్టు ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ ( Pranab Mukherjee's son Abhijit Mukherjee ) ట్విటర్ ద్వారా సమాచారం అందించారు. ప్రణబ్ ముఖర్జీ గత కొంత కాలంగా కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలో ఉన్న ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ఆర్ ఆర్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనావైరస్ ( Coronavirus ) పాజిటీవ్ ఉన్నట్టు కూడా తేలింది. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. 

Trending News