India Corona updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ( Coronavirus ) కేసులు రోజురోజుకి విజృంభిస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారితో మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. నిత్యం 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే లక్షకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ( India corona cases ) కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. Also read: Unlock 3.0: 27న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 757 మంది ఈ మహమ్మారితో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,36,861కు పెరగగా..మృతుల సంఖ్య 31,358కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8,49,431 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం 4,56,071 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also read: #Watch: పురిటినొప్పులను మించిన కష్టం
నిన్న ఒక్కరోజే 4,20,898 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో జూలై 24 వరకు దేశంలో 1,58,49,068 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఒకేరోజులో ఇంతపెద్ద మొత్తంలో పరీక్షలు జరపడం ఇదే మొదటిసారి. దేశంలో కరోనా రికవరీ రేటు 63.5శాతం ఉండగా.. మరణాల రేటు 2.3శాతంగా ఉంది. Also read: Apple: భారత్‌లో ఐఫోన్ 11 ఉత్పత్తి ప్రారంభం
Covid-19: 13 లక్షలు దాటిన కరోనా కేసులు