India Corona Positive Cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. తాజాగా 40 వేల దిగువన కరోనా కేసులు రావడంతో భారీ ఊరట కలిగింది. డెల్టా, డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ కేసులు పుట్టుకొస్తున్నా, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, కోవిడ్19 నిబంధనలతో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత్‌లో తగ్గుతోంది.
ఇండియాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం (జులై 5) ఉదయం 8 గంటల వరకు 15,22,504 (15 లక్షల 22 వేల 504) శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 39,796 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం కరోనా వైరస్ (CoronaVirus) బాధితుల సంఖ్య 3,05,85,229కు (30 కోట్ల 5 లక్షల 85 వేల 229)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే పాజిటివ్ కేసులతోపాటు కోవిడ్ మరణాలు సైతం తగ్గాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా మరో 723 మందిని కోవిడ్19 మహమ్మారి బలిగొంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,02,728 (4 లక్షల 2 వేల 728)కు చేరుకుంది. భారత్‌లో ఇప్పటివరకూ 35 కోట్ల 28 లక్షల 92 వేల 046 డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: COVID-19 Vaccine: డెల్టా వేరియంట్‌పై Johnson and Johnson సింగిల్ డోసు టీకా ప్రభావం, 8 నెలలపాటు సేఫ్
India reports 39,796 new #COVID19 cases, 42,352 recoveries, and 723 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 3,05,85,229
Total recoveries: 2,97,00,430
Active cases: 4,82,071
Death toll: 4,02,728Total Vaccination: 35,28,92,046 pic.twitter.com/AKIFq1aiu4
— ANI (@ANI) July 5, 2021
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో మరో 42,352 మంది కరోనా మహమ్మారిని జయించారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,97,00,430 (2 కోట్ల 97 లక్షల 430)కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97 శాతానికి పైగా ఉండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు దేశంలో Covid-19 యాక్టివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఇండియాలో ప్రస్తుతం 4,82,071 (4 లక్షల 82 వేల 071) యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది.
Also Read: Delta Plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు, మరింత సమాచారం వస్తేనే స్పష్టత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook