శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని అవంతిపురలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో కన్నుమూసిన అమర జవాను పార్థివదేహాల తరలింపులో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన వంతు పాత్ర పోషించారు. శ్రీనగర్‌లో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్.. అక్కడ అమర జవాన్ల పార్థివదేహాలను తోటి జవాన్లతో కలిసి తన భుజాలపై తరలించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి జమ్ముకాశ్మీర్ డీజీపి దిల్‌బాగ్ సింగ్, ఇతర సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు సైతం అమరజవాన్ల పార్థివదేహాల తరలింపులో తమ భుజం అందించారు.
శ్రీనగర్ వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్.. సీఆర్పీఎఫ్ చీఫ్ రాజీవ్ రాయ్ భట్నాగర్, జమ్ముకాశ్మీర్ డీజిపి దిల్‌బాగ్ సింగ్, ఇతర భద్రతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
తన భుజాలపై జవాన్ పార్థివదేహాన్ని మోసిన రాజ్‌నాథ్ సింగ్!