CBSE Board Exams 2021: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన బోర్డ్

CBSE Board Exams 2021 details: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించే విధానంలో మార్పులుచేర్పులు చేపట్టారని, షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న Fake news ని నమ్మవద్దని సీబీఎస్ఈ ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2021, 09:15 PM IST
  • సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించే విధానంలో, పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న CBSE circular.
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్క్యులర్ చూసి అయోమయానికి గురవుతున్న CBSE students.
  • స్టూడెంట్స్‌ని అయోమయానికి గురిచేస్తున్న సర్క్యులర్‌పై స్పందించిన CBSE Board.
CBSE Board Exams 2021: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన బోర్డ్

CBSE Board Exams 2021 details: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించే విధానంలో మార్పులుచేర్పులు చేపట్టారని, షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న Fake news ని నమ్మవద్దని సీబీఎస్ఈ ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. గతేడాది ఏప్రిల్ 1న ఇచ్చిన ఓ పాత సర్కులర్ ని దురుద్దేశపూర్వకంగా కావాలనే కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అది పాత సర్కులర్ అనే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలని సీబీఎస్ఈ కోరింది. 

పాత సర్కులర్ చూసి విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారన్న సీబీఎస్ఈ.. అధికారిక సమాచారం కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాల్సిందిగా విద్యార్థులకు సూచించింది. 

ఇదిలావుంటే, మరోవైపు కొవిడ్-19 సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలకు (CBSE practicals 2021) హాజరుకాలేని విద్యార్థులకు జూన్ 11 కంటే ముందుగానే మరో అవకాశం కల్పించనున్నట్టు సీబీఎస్ఈ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఎస్ఈ కోర్సులు బోధిస్తున్న విద్యా సంస్థలకు సైతం సీబీఎస్ఈ నుంచి మార్గదర్శకాలు (CBSE guidelines) జారీ అయ్యాయి. 

Also read : Wild dog movie review: వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ, రేటింగ్

ఇదే విషయమై సీబీఎస్ఈ ఎగ్జామ్స్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తాజాగా పీటీఐతో మాట్లాడుతూ.. ''సీబీఎస్ఈ విద్యార్థులకు కానీ లేదా వారి కుటుంబసభ్యులకు ఎరికైనా కరోనా సోకిన కారణంగా విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేకపోతే వారికి జూన్ 11 లోగా తగిన సమయంలో మరో అవకాశం కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి'' అని తెలిపారు. CBSE class 10th and 12th exams 2021 date sheet revised

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News