Inter Hall Tickets 2025: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 1 నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణలో మార్చ్ 5 నంచి మార్చ్ 20 వరకూ జరగనున్నాయి. ఏపీలో ఇంటర్ హాల్ టికెట్లను bie.ap.gov.in వెబ్‌సైట్ నుంచి తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లను tgbie.cgg.gov.in నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఏపీలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in నుంచి లేదా ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన వాట్సప్ సేవల ద్వారా పొందవచ్చు.
ఏపీలో ఇంటర్ హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
ముందుగా bie.ap.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. స్క్రీన్‌పై కన్పించే హాల్ టికెట్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు విద్యార్ధులు తమ పుట్టిన తేదీతో పాటు గత ఏడాది హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్ధులయితే మొదటి ఏడాది పరీక్షల హాల్ టికెట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే మొదటి సంవత్సరం విద్యార్ధులయితే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. అంతే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ కన్పిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే చాలు.
వాట్సప్ ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఎలా
ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ పరిపాలన ద్వారా అందిస్తున్నసేవల్లో హాల్ టికెట్లు పొందవచ్చు. దీనికోసం ముందుగా 95523 00009 వాట్సప్ నెంబర్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ముందు HI అని మెస్సేజ్ పెట్టాలి. ఆ తరువాత భాషను EN లేదా TE అని టైప్ చేసి పంపించాలి. ఇప్పుడు మీ స్క్రీన్‌పై కన్పించేవాటిలో కావల్సిన సర్వీసుల్లో ఎడ్యేకేషన్ సర్వీస్ ఎంచుకోవాలి. అక్కడి నుంచి ఇంటర్ హాల్ టికెట్ ఆప్షన్ క్లిక్ చేశాక పుట్టినతేదీ, గత సంవత్సరం పరీక్షల హాల్ టికెట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. మీ హాల్ టికెట్ వాట్సప్ ద్వారా వస్తుంది.
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
ముందుగా అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ఓపెన్ చేసి హోమ్ పేజిలో కన్పించే అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత కొత్త పేజీ కన్పిస్తుంది. ఇప్పుడు గత ఏడాది హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. అంతే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Also read: Pan 2.0: పాన్ 2.0 తీసుకున్నారా, ఉచితంగా ఎలా అప్లై చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి