Tips of Eating Mangoes: వేసవి అంటే భగభగమండే ఎండలతో పాటే..రుచికరమైన మామిడి పండ్లు కూడా గుర్తొస్తుంటాయి. మామిడి పంఢ్లను తినేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలొస్తాయి.
సమ్మర్ స్పెషల్ పండ్లు అంటే ఎవరికైనా మామిడి పంఢ్లు ఠక్కున గుర్తొస్తాయి. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఈసారి మార్కెట్‌లో కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. మరింకెందుకు ఆలస్యం వెంటనే కొని..అక్కడే తినేద్దామనుకుంటున్నారా..పొరపాటున కూడా ఆ పని చేయవద్దు.
మామిడి పండ్లు తినేముందు కాస్సేపు నీళ్లలో నానబెట్టి తినమని పెద్దలు చెబుతుండటం తెలిసే ఉంటుంది. ఈ పద్ధతిని లైట్‌గా తీసుకోవద్దు. ఇదేదో శుభ్రత కోసం అనుకోవద్దు. దీనివెనుక శాస్త్రీయమైన కారణాలున్నాయి. అందుకే పెద్దలు ఏం చెప్పినా దానికో అర్ధముంటుంది. మామిడి పండ్లను నీళ్లలో ఎందుకు నానబెట్టాలి, దాని వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందనేది పరిశీలిద్దాం..
మామిడి పంఢ్లు ఎంత రుచికరమైనవైనా శరీరానికి వేడి చేస్తాయి. అందుకే కాస్సేపు నీటిలో నానబెట్టడం ద్వారా ఆ పరిస్థితిని నివారించవచ్చు. నీటిలో నానబెట్టడం వల్ల మామిడి పండ్లకుండే ఫైటిక్ యాసిడ్ తొలగించవచ్చు. ఇదే శరీరంలో వేడికి కారణమవుతుంది. అయితే ఇందులో ఐరన్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. అంతేకాదు..మామిడిపండ్లను నీళ్లలో నానబెట్టడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరమౌతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఇక పంటలకు వాడే పురుగుమందుల ప్రభావం నుంచి రక్షించేందుకు ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. మామిడిపండ్లను నానబెట్టినప్పుడు అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ కరిగి..ట్రంక్‌లోని పాలరసాన్ని తొలగిస్తుంది. ఫలితంగా వివిధ రకాల ఎలర్జీలు, తలనొప్పి, చర్మం దురద తగ్గుతాయి. ఇక మరో ఉపయోగం మామిడి పండ్ల కారణంగా తలెత్తే వేడి తగ్గుతుంది. మామిడిపంఢ్లలో ఉ్టే ఫైటో కెమికల్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. నీళ్లలో నానబెట్టినప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది.
Also read: Sweating Reasons: చెమట్లు పడుతుంటే నిర్లక్ష్యం చేయవద్దు..ప్రాణాంతక కేన్సర్‌కు కారణం కావచ్చు కూడా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook