Lucky Iron Fish: మనిషి ఆరోగ్యాన్ని నయం చేసే " ఐరన్ ఫిష్" గురించి మీకు తెలుసా??

Iron Fish Health Benefits: ఐరన్ ఫిష్ అనేది ఇనుప లోహంతో తయారు చేసిన ఒక చిన్న చేప ఆకారపు వస్తువు.  దీని ఐరన్‌ లోపంతో బాధపడేవారు ఆహారం తయారు చేసే సమయంలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఐరన్‌ ఫిష్‌ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు గురించి తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Feb 23, 2025, 01:37 PM IST
Lucky Iron Fish: మనిషి ఆరోగ్యాన్ని నయం చేసే " ఐరన్ ఫిష్" గురించి మీకు తెలుసా??

Iron Fish Health Benefits: ఐరన్ ఫిష్ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఐరన్ ఫిష్ అనేది ఇనుప లోహంతో తయారు చేసిన ఒక చిన్న చేప ఆకారపు వస్తువు. ఇది ఐరన్‌ లోపం (రక్తహీనత) తో బాధపడుతున్న వారికి ఆహారం ద్వారా ఐరన్‌ను అందించడానికి సహాయపడుతుంది.

ఐరన్‌ ఫిష్‌ ప్రాముఖ్యత: 

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాధారణం. ఐరన్‌ లోపం వల్ల అలసట, బలహీనత, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఐరన్ ఫిష్ అనేది సరసమైన పరిష్కారం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది ప్రజలు వారి ఆహారం ద్వారా తగినంత ఐరన్‌ను పొందడానికి సహాయపడుతుంది. దీని ఉపయోగించడం కూడా ఎంతో సులభం. ఐరన్ ఫిష్‌ను వంట చేసే సమయంలో నీటిలో లేదా సూప్‌లో వేసి మరిగించడం వల్ల, మరిగే ప్రక్రియలో, ఐరన్‌ చేప నుంచి ఆహారంలోకి విడుదల అవుతుంది. ఈ ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్‌ ఫిష్‌ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

ఐరన్‌ ఫిష్‌ చర్రిత: 

ఐరన్ ఫిష్‌ను మొదటగా కాంబోడియాలో కనుగొన్నారు. 2008లో కెనడియన్ హెల్త్ వర్కర్లు, ప్రత్యేకించి క్రిస్టోఫర్ చార్లెస్ అనే వ్యక్తి కాంబోడియాలో ఐరన్ లోపం (రక్తహీనత)తో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి ఈ ఆలోచనను అభివృద్ధి చేశారు. కాంబోడియాలో మహిళలు గర్భధారణ సమయంలో ఐరన్‌ లోపంతో బాధపడుతుండటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చార్లెస్, అతని బృందం ఇనుప లోహంతో తయారు చేసిన ఒక చిన్న చేప ఆకారపు వస్తువును రూపొందించారు. ఈ ఐరన్ ఫిష్‌ను వంట చేసే సమయంలో నీటిలో లేదా సూప్‌లో వేసి మరిగించడం ద్వారా ఆహారంలో ఐరన్‌ స్థాయిలను పెంచవచ్చు. ఇది ఇనుప లోపంతో బాధపడుతున్న ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2012లో, "ది లక్కీ ఐరన్ ఫిష్ ప్రాజెక్ట్" అనే సంస్థను స్థాపించి ఈ ఐరన్ ఫిష్‌లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం ప్రారంభించారు.

ఐరన్ ఫిష్ ను ఎలా ఉపయోగించాలి:

ఐరన్ ఫిష్‌ను ఉపయోగించే ముందు శుభ్రంగా కడగాలి. వంట చేసే సమయంలో, ఐరన్ ఫిష్‌ను నీటిలో లేదా సూప్‌లో వేసి 10 నిమిషాలు మరిగించాలి. మరిగించిన తర్వాత, ఐరన్ ఫిష్‌ను తీసివేసి, ఆహారాన్ని వడ్డించాలి. ప్రతి ఉపయోగం తర్వాత ఐరన్ ఫిష్‌ను కడిగి పొడిగా ఉంచాలి.
 

 

 

ఇదీ చదవండి: సర్కారీ నౌకరీ మీ కల? రూ.180000 జీతం.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News