భారత్‌లో కరోనాపై పోరాటంలో భాగంగా గత నాలుగు నెలలుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవాగ్జిన్ కరోనా టీకాలు ఇస్తున్నారు. కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటీవల రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి, డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డిజీ మెడిసిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం పొందాయి. తాజాగా మార్కెట్లోకి సైతం ఈ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది.
కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఓ ఆసక్తికర విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఫైజర్/బయోఎన్‌టెక్ మరియు మోడెర్నా కోవిడ్-19 వ్యాక్సిన్లు (COVID-19 Vaccine) భారత్‌లో గుర్తించిన ప్రమాదకర కరోనా వేరియంట్లు B.1.617 మరియు B.1.618 రకాలపై మెరుగ్గా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ప్రి ప్రింట్ పేపర్‌లో ఈ విషయాలు ప్రచురించారని, నిపుణులు మరింత లోతుగా దీనిపై పరిశోదన జరుపుతున్నారని సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రమాదకర వేరియంట్లను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు రూపొందుతున్నాయని సైతం వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి
ప్రమాదకర కరోనా వేరియంట్లు B.1.617 మరియు B.1.618లకు సైతం యాంటీబాడీలు త్వరగా ఏర్పడటం శుభపరిణామమని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు వారి జర్నల్‌లో ప్రచురించారు. ఇతర వ్యాక్సిన్లతో పోల్చితే ఫైజర్/బయోఎన్‌టెక్ (Pfizer Vaccine) మరియు (Moderna COVID-19 Vaccine) మోడెర్నా కోవిడ్-19 వ్యాక్సిన్లు (CoronaVirus) మాత్రం ఆ రెండు రకాల కరోనా వేరియంట్లపై మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని గుుర్తించారు. B.1.617 కరోనా వేరియంట్ దాదాపు 50 దేశాలకు వ్యాపించిందని, మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇతర వేరియంట్ల కన్నా ఈ కరోనా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది.
Also Read: High Blood Pressure సమస్యపై అపోహలున్నాయా, నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకోండి
కరోనా బారి నుంచి కోలుకున్న 8 మంది, ఫైజర్/బయోఎన్‌టెక్ కోవిడ్19 వ్యాక్సిన్లు తీసుకున్న ఆరుగురిపై, మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురిపై సీరమ్ సర్వే నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు. ఈ రెండు రకాల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో B.1.617 మరియు B.1.618లతో పోరాడగలిగే యాంటీబాడీలు వేగంగా తయారయ్యాయని సర్వేలో తేలింది. దాంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న భయంకరమైన కరోనా వేరియంట్లకు ఫైజర్ వ్యాక్సిన్ మోడెర్నా వ్యాక్సిన్ మెరుగైన ప్రభావం చూపుతాయని నిర్ధారించారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కరోనా టీకాలు తీసుకున్న వారికి కరోనా సోకినా వారి నుంచి అంత ఎక్కువగా ప్రభావం లేని వైరస్ వేరియంట్లు ఇతరులకు తక్కువ సంఖ్యలో వ్యాప్తి చెందుతాయని నిపుణులు గుర్తించారు.
Also Read: Covid-19: ఫేస్ మాస్కులు సుదీర్ఘకాలం వాడితే శరీరంలో Oxygen తగ్గుతుందా, నిజమేంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook