Heart Tests: మీ గుండె ఆరోగ్యాన్ని వెంటనే చెప్పే 7 కీలకమైన పరీక్షలు ఇవే, వెంటనే చేయించండి

Heart Tests: గుండె ఆరోగ్యం అత్యంత ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యం గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు 7 రకాల పరీక్షలు చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2022, 07:24 PM IST
Heart Tests: మీ గుండె ఆరోగ్యాన్ని వెంటనే చెప్పే 7 కీలకమైన పరీక్షలు ఇవే, వెంటనే చేయించండి

Heart Tests: గుండె ఆరోగ్యం అత్యంత ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యం గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు 7 రకాల పరీక్షలు చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం..

గుండె కొట్టుకున్నంతసేపే మనిషి ప్రాణం నిలుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉన్నంతసేపే ఇది సాధ్యమౌతుంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను సరఫరా చేసేది గుండెనే. మరి మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు 7 రకాల పరీక్షలు అవసరమౌతాయి. ఆ వివరాలు మీ కోసం.

గుండె అనేది మన శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి. గుండెనే మన శరీరంలో రక్తాన్ని సరఫరా చేస్తుంది. అందుకే గుండె పనితీరు సరిగ్గా ఉండాలంటే..ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. చెడు ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చుని ఉండటం, ఒత్తిడితో జీవించడం గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అయితే అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె వ్యాధులకు సంబంధించిన కుటుంబ నేపధ్యం గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి.

గుండె పోటు మరణాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కార్డియోవాస్క్యులర్ వ్యాధుల కారణంగా ఎక్కువమంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా గుండె సంబంధిత వ్యాధుల కారణంగా 1.79 కోట్ల మంది మరణిస్తున్నారు. మరింత దిగ్భ్రాంతి కల్గించే విషయమేమంటే..ప్రతి ఐదుగురిలో నలుగురి మృతి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కారణంగా జరుగుతోంది. ఇందులో మూడవవంతు తక్కువ వయస్సు అంటే 70 ఏళ్లలోపే మరణిస్తున్నారు. 

మరి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలనేదే అసలు ప్రశ్న. ఒకవేళ మీరు ఎక్కువకాలం, ఆరోగ్యంగా జీవించాలనుకుంటే..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవల్సిన అవసరముంది. గుండెను ఆరోగ్యంగా ఉంచేంచుకు..మీ గుండె ఎంతవరకూ ఆరోగ్యంగా ఉందో చెప్పే కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. తరచూ ఈ పరీక్షలు చేయిస్తుండాలి. ఫలితంగా మీ గుండె ఆరోగ్యం గురించి తెలుస్తుంది. 

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా గుండె ఆరోగ్యం తెలుస్తుంది. మీ శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ స్థాయి గురించి తెలుస్తుంది. ఒకవేళ మీ శరీరంలో కొలెస్ట్రాల్ , ట్రై గ్లిసరాయిడ్స్ స్థాయి ఎక్కువగా ఉంటే గుండె వరకూ రక్తం చేరడంలో సమస్య ఎదురౌతుంది. ఫలితంగా అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఎదురౌతాయి. హార్ట్ ఎటాక్‌కు కారణమౌతుంది.

కార్డియాక్ రిస్క్, కార్డియాక్ స్క్రీన్ టెస్ట్

బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ , షుగర్ టెస్ట్ ద్వారా గుండె సంబంధిత వ్యాధుల్ని గుర్తించడం, నియంత్రించడం సాధ్యమే. కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధుల నేపధ్యముంటే ఈ పరీక్షలు అవసరం. మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు బాధితులు ఈ పరీక్షల ద్వారా గుండె పనితీరు తెలుసుకోవచ్చు.

ట్రూ హెల్త్ హార్ట్

మీ గుండె ఆరోగ్యం బేసిక్స్, గుండె సంబంధిత విషయాలను స్పష్టంగా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా ఇతర పరీక్షలు చేయించుకోవచ్చు.

డయాబెటిస్, స్థూలకాయం పరీక్ష

ఒకవేళ మీకు టైప్ 2 డయాబెటిస్ లేదా డయాబెటిస్ మెలిటస్ ఉండి..సరైన చికిత్స తీసుకోకపోతే అధిక రక్తపోటు, గుండె ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే అప్పుడప్పుడూ బ్లడ్ షుగర్ పరీక్ష చేయిస్తుండాలి. బరువు ఎక్కువైనా లేదా స్థూలకాయం ఉన్నా..గుండె వ్యాధులు రావచ్చు. స్థూలకాయం పరీక్ష చాలా మంచిది.

రక్త పరీక్షలు

కండరాల్లో ఎదురయ్యే ఏ విధమైన ఇబ్బంది ప్రత్యేకించి హార్ట్ ఎటాక్ వంటి పరిస్థితుల్లో శరీరం.. రక్తంలో ఓ రకమైన కెమికల్ పంపిస్తుంది. బ్లడ్ టెస్ట్ ద్వారా మీ గుండె కండరాలకు ఎంతవరకూ హాని కలిగిందో తెలుసుకోవచచు. బ్లడ్ టెస్ట్ ద్వారా రక్తంలో ఉండే బ్లడ్ ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ తెలుసుకోవచ్చు.

ఈసీజీ

ఈసీజీ సహాయంతో గుండె విద్యుత్ ఆవేశాన్ని పరీక్షించవచ్చు. ఈసీజీ ద్వారా గుండె ఏ విధంగా రక్తాన్ని పంపింగ్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఈసీజీ ద్వారా గుండె ఎలక్ట్రికల్ ఇంపల్స్ రికార్డ్ చేస్తారు. మీ గుండె స్పందన రేటు ఎలా ఉందో తెలుస్తుంది. 

ఎక్సర్‌సైజ్ స్ట్రెస్ టెస్ట్

దీనినే త్రెడ్ మిల్, ఎక్సర్‌సైజ్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. దీని ద్వారా వర్కవుట్స్ ద్వారా గుండె ఎంతబాగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.

Also read: Corona Nasal vaccine: ఇక కరోనా వ్యాక్సిన్ మిమ్మల్ని భయపెట్టదు, నాజిల్ వ్యాక్సిన్‌కు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News