Allergic Cough: వాతావరణం మారుతూనే ఇన్‌ఫెక్షన్, వైరల్ ఫీవర్ సమస్య అధికమౌతుంది. ఎలర్జీ ముఖ్యంగా వేధిస్తుంటుంది. ఎలర్జీ దగ్గుంటే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, హోమ్ రెమిడీస్ ఏమున్నాయో చూద్దాం..
వాతావరణం మారగానే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు వ్యాపిస్తుంటాయి. ప్రధానంగా కన్పించేది ఎలర్జీ. ఎలర్జీ కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎలర్జీ కారణంగా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కష్టమౌతుంది. ఎలర్జిక్ దగ్గు ఉన్నప్పుడు ఏయే లక్షణాలు కన్పిస్తాయి, ఆ లక్షణాల్ని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకుందాం..
ఎలర్జీ దగ్గు లక్షణాలు
గొంతులో దురదగా ఉంటూ దగ్గు రావడం, గొంతులో గరగర ఎక్కువగా ఉండటం, గొంతులో నొప్పి, చెవులు, ముక్కులో దురద, ముక్కు కారడం, ముక్కు క్లోజ్ అవడం, తుమ్ములు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, వాంతులు, ఛాతీలో నొప్పి ప్రధానంగా కన్పిస్తాయి. ఈ లక్షణాలుంటే ఎలర్జిక్ దగ్గుగా భావించవచ్చు.
మెంతి గింజలతో..
మెంతి నీరు తాగడం వల్ల ఛాతీలో కఫం ఉంటే తొలగిపోతుంది. మెంతిగింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. వీటివల్ల ఛాతీ ఆరోగ్యంగా ఉంటుంది. బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుతాయి మెంతి గింజలు. వర్షాకాలంలో దగ్గు, జలుబు సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తాయి. మెంతిగింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల..ఆరోగ్యం బాగుంటుంది ఓ కప్పు నీళ్లలో ఒక స్పూన్ మెంతిగింజలు రాత్రంతా నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున తీసుకోవాలి. లేదా నీళ్లలో మెంతిగింజలు బాగా ఉడకబెట్టి..వడకాచి చల్లారిన తరువాత ఆ నీళ్లను రోజుకు 2 సార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి.
వాము నీరుతో..
వామునీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి హాని కల్గించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది వాము నీరు. వాము నీరు తాగడం వల్ల గొంతు, ఛాతీ పనితీరు మెరుగవుతుంది. మరోవైపు వాము నీరు తాగడం వల్ల పైత్యం తగ్గించుకోవచ్చు. రోజుకు 3 సార్లు తాగవచ్చు.
Also read: Weight Lose Tips: బరువు తగ్గాలనుకుంటే.. దీని కంటే సులభమైన చిట్కా ఇంకేమీ లేదు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook