Dates Nutrition Facts And Health Benefits: వ్యాయామాలు చేసేవారు తప్పకుండా తమ డైట్లో ఖర్జూర ఉండేటట్లు చూసుకుంటారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావలసిన విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్ పరిమాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి ప్రతిరోజు డైట్ లో భాగంగా ఖర్జూరాను తినడం వల్ల కండరాలు మెరుగుపడతాయి. ఇవే కాకుండా ఇందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు శరీరానికి అద్భుతమైన శక్తిని అందించేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఖర్జూరాను డైట్ లో చేర్చుకోవడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. ఖర్జూరాలు ఉండే పొటాషియం గుండెను శక్తివంతంగా.. ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఖర్జూరాలు తినడం వల్ల ఇవే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శక్తిని పెంచుతుంది:
ఖర్జూరాలో పొటాషియంతో పాటు మెగ్నీషియం, విటమిన్ b6, ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి అన్ని రకాల సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్టలోని ప్రేగులను ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడతాయి.
పొట్ట సమస్యలకు:
కొంతమంది తరచుగా జీర్ణ సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇది నెమ్మది నెమ్మదిగా పెరిగి ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. నిజానికి పొట్ట సమస్యలు ఉన్నవారు కూడా ఖర్జూరాలు తినడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ఎందుకంటే ఖర్జూరాలో ఉండే కొన్ని గుణాలు జీర్ణ క్రియను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతాయి. అలాగే మలబద్ధకం నివారణకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను తేలికగా చేస్తాయి. దీని కారణంగా గ్యాస్టిక్ వంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.
గుండె సమస్యలకు:
ఖర్జూర రోజు తినడం వల్ల హృదయ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇందులో ఉండే పొటాషియం ఇతర ఖనిజాలు గుండెను శక్తివంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే మూలకాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా ప్రభావంతంగా కృషి చేస్తాయి. కాబట్టి ఇప్పటికే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఖర్జూరాల తినాల్సి ఉంటుంది.
చర్మ సమస్యలకు:
తరచుగా చాలామంది ఇబ్బంది పడే సమస్యల్లో చర్మ సమస్యలు ఒకటి. ఎండ, వాన అని కాలాలు లేకుండా చాలామంది చర్మ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు తప్పకుండా ఉదయం పూట ఖర్జూరాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే అన్ని రకాల చర్మ సమస్యలను పోగొట్టేందుకు కీలకపాత్ర పోషిస్తుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.