Benefits Of Green Grapes: వేసవిలో ద్రాక్ష పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజూ తినడం వల్ల ఎండకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు మానసిన అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలిగించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ద్రాక్ష పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ద్రాక్షలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ద్రాక్షలో ఉండే పోషకాలు:
ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లతో పాటు విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షలో గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా టీబీ, క్యాన్సర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ద్రాక్షను ఎలా తినాలి?
ఆయుర్వేదంలో ద్రాక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజూ ఎండు ద్రాక్షలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, గులాబీ ద్రాక్షలు లభిస్తున్నాయి. ఇవి తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఆకుపచ్చ ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
టిబి, క్యాన్సర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కంటి చూపును పెంచడానికి కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే గుణాలు ముఖంపై మెరుపును కూడా తీసుకువస్తాయి.
ద్రక్షలో పొటాషియం, విటమిన్-బి లభిస్తుంది. కాబట్టి ఎముకలను దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఇందులో ఉండే గుణాలు అలసటను దూరం చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook