RAM Rapid Action Mission Release Date: రిపబ్లిక్ డే సందర్భంగా చాలా చిత్రాలు పోటీలో ఉన్నాయి. జనవరి 26న బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండేట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ వారం వస్తున్న చిత్రాలన్నింటిలో రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్)పై అందరి దృష్టి పడింది. దేశ భక్తిని చాటే సినిమాగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ఉండబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా జానర్ ఏంటో చెప్పేసింది. ఎలా ఉండబోతోందో చూపించేశారు.
రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.
ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. 144 నిమిషాల (రెండు గంటల 24 నిమిషాలు) నిడివితో రాబోతోన్న ఈ చిత్రంలో చివరి 40 నిమిషాలు యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయని, మంచి సందేశాత్మకంగా చిత్రంగా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. సందేశాత్మక చిత్రమని కొనియాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook