World Most Expensive Share is Berkshire Hathaway: షేర్ మార్కెట్లో చాలా కంపెనీల షేర్లు అందుబాటులో ఉంటాయి. వేర్వేరు కంపెనీ షేర్ల ధరలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని షేర్లు చాలా చౌకగా ఉంటే కొన్ని అత్యంత ఖరీదైనవి ఉంటాయి. ఇండియాలో ఎంఆర్ఎఫ్ కంపెనీ షేర్ అత్యంత ఖరీదైందిగా భావిస్తారు. ఈ కంపెనీ షేర్ ఏకంగా 84 వేల రూపాయలు. అదే సమయంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ ఏ కంపెనీది, ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. నమ్మశక్యం కాని ధర అది. ఈ షేర్ కొనడం అందరివల్ల కానిపని.
మనం చర్చిస్తున్న షేర్ కంపెనీ Berkshire Hathawayఈ కంపెనీ షేర్ వేలల్లో, లక్షల్లో లేదు. కోట్లలో ఉంటుంది. నమ్మశక్యంగా లేదా. నిజమే. ఈ కంపెనీ ఒక్క షేర్ కొనాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే.
Berkshire Hathaway షేర్ ధర
ప్రస్తుతం Berkshire Hathaway షేర్ ధర 4,67,660 అమెరికన్ డాలర్లు. అంటే ఇండియన్ రూపీస్‌లో చెప్పుకుంటే 3 కోట్ల 83 లక్షల 38 వేల 439 రూపాయల 44 పైసలు. ఈ కంపెనీ ఒక్క షేర్ కొనాలంటే కోటీశ్వరుడై ఉండాలి. ఇదొక అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం నెబ్రాస్కాలో ఉంది.
Also Read: Bank Holidays from Today: ఈ రోజు నుండి వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు
కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉంది. ప్రపంచ ఆదాయంతో పోలిస్తే అతిపెద్ద ఆర్ధిక సేవల కంపెనీ ఇది. వారెన్ బఫెట్ ఈ కంపెనీ ఛైర్మన్. ఈ కంపెనీ షేర్ ఎందుకింత ఖరీదంటే..ఇప్పటి వరకూ ఎప్పుడూ స్టాక్ స్ప్లిట్ కాలేదు. అక్టోబర్ 23, 2026 న తొలిసారి కంపెనీ స్టాక్ లక్ష డాలర్లు దాటేసింది.
Also Read: Remote Ceiling Fan: సగానికి తగ్గిన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ ధరలు.. భారీగా విద్యుత్ బిల్లు ఆదా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook