Rare Disease: అరుదైన వ్యాధిని కనుగొన్న వైద్యులు.. శరీరం రాయిలా తయారవడం మీరెప్పుడైనా చూశారా..?

Rare Disease: వైద్యరంగంలో అంతుచిక్కని వ్యాధిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు ఎముకల్లా మారిపోయి.. శరీరం రాయిలా తయారవుతుంది. ఈ వ్యాధికి వైద్య నిపుణులు స్టోన్‌మాన్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 26, 2023, 08:47 PM IST
Rare Disease: అరుదైన వ్యాధిని కనుగొన్న వైద్యులు.. శరీరం రాయిలా తయారవడం మీరెప్పుడైనా చూశారా..?

 
Rare Disease Stone Man Syndrome: వైద్యరంగంలో ఇంతవరకు ఎప్పుడు చూడని ఓ వింత వ్యాధి ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో కోవిడ్ వంటి చాలా రకాల వ్యాధులు మనం చూసాం. కానీ ఇప్పుడు వినబోయేది చూడబోయే వ్యాధి మీకు వింతగా అనిపించవచ్చు. ఇంతకీ ఈ వ్యాధి ఏమిటనే అనుకుంటున్నారా..? అయితే న్యూయార్క్ చెందిన 29 ఏళ్ల యువకుడి శరీరం క్రమంగా రాయిలా మారడం ప్రారంభమైంది. ఇప్పుడు ఇది పీక్స్ కు చేరుకుంది. ఇలా శరీరం రాయిగా మారడం కారణంగా ఆ యువకుడు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ వ్యాధికి డాక్టర్లు ఫైబ్రోడిస్ప్లాసియా ఒస్సిఫికన్స్ ప్రోగ్రెస్సివా (FOP) అని పేరు పెట్టారు. 

ఈ వ్యాధిని వైద్యులు చాలా ఆలస్యంగా గుర్తించారని.. రెండు మిలియన్ల జనాభాలో ఈ వ్యాధి ఒకరికి వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల శరీరం బండలా మారిపోతుందని.. జన్యుపరంగా కూడా ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి వ్యాధి వచ్చే వారిలో శరీరం ముందుగానే దృఢంగా బండలా తయారవుతుందన్నారు. 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Man Turning into Stone (@joesoochh)

ఈ వ్యాధి ప్రమాదకరమైనదేనా?:
JOE తన యూట్యూబ్ ఛానెల్‌లో తన అనారోగ్యం గురించి వివరించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం 800 మంది మాత్రమే ఈ సిండ్రోమ్‌ బారిన పడ్డారని ఆయన తెలిపారు. ఇలాంటి వ్యాధి బారిన పడ్డవారిని డాక్టర్లు లేటుగా గుర్తించారన్నారు. అంతేకాకుండా తన శరీరంలో పెరిగిన ఎముకల కారణంగా చర్మంపై కత్తి గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి కారణంగా చర్మం పై నొప్పులు పెరుగుతాయని ఆయన తెలిపారు.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

స్టోన్ మ్యాన్ సిండ్రోమ్ (Stone Man Syndrome)అంటే ఏమిటి?
స్టోన్ మ్యాన్ సిండ్రోమ్ (ఫైబ్రోడిస్ప్లాసియా ఒస్సిఫికన్స్ ప్రోగ్రెస్సివా) అనేది ఒక జన్యుపరమైన వ్యాధి.. ఈ వ్యాధి కారణంగా కండరాలు దృఢంగా తయారై ఎముకల్లా మారిపోతాయి. తద్వారా చర్మంపై హ్యాపీ పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.

స్టోన్‌మాన్ సిండ్రోమ్ లక్షణాలు:
ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారిని సులభంగా గుర్తించవచ్చు. ఈ సమస్య తెలియ లేకపోవడం కారణంగా ఎవరు సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు. ఈ వ్యాధి పుట్టుకతోనే వస్తుందని.. నవజాతి శిశువులలో కాలివేలలో బొటనవేలు సూక్ష్మంగా ఉండడం, క్రమంగా మొండెం పెరగడం వీపుతో పాటు తుంటి కూడా పెరగడం వంటి లక్షణాలు శరీరంలో ఏర్పడతాయి.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

  

Trending News