Jetty OTT Release Date And Platform: మత్స్యకారుల లైఫ్‌స్టైల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ జెట్టి. మానినేని కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన ఈ సినిమాను వర్ధిన్ ప్రొడక్షన్స్‌పై కె.వేణు మాధవ్ నిర్మించారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్‌లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ వంటిస్టార్స్ రావడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. గతేడాది బాక్సాఫీసు వద్ద సందడి చేసిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 17వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా.. నేటి రాత్రి నుంచే అందుబాటులో ఉండనుంది.
కథ విషయానికి వస్తే.. గ్రామీణ నేపథ్యంలో తీసుకున్నారు. గ్రామాల్లో కట్టుబాట్లు.. ఆచార సంప్రదాయాలు, మత్స్యకారుల జీవన విధానంపై తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఇందులో సీన్లు సహజత్వానికి అద్దంపట్టేలా ఉంటాయి. తనకు ఫస్ట్ మూవీ అయినా.. యాక్షన్ సీక్వెన్స్‌లో హీరో మానినేని కృష్ణ సూపర్‌గా నటించాడు. స్కూల్ టీచర్ క్యారెక్టర్‌లో మెప్పిస్తునే.. గ్రామాభివృద్ధికి పాటు పడే వ్యక్తిగా అదరగొట్టేశారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారిణి పాత్రలో నందితా శ్వేత నటించింది. గ్రామీణ యువతిగా చక్కగా తెరపై కనిపించింది. గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి ఒదిగిపోయారు. ఆయన పాత్ర ఆడియన్స్‌కు ఎక్కువగా నచ్చుతుంది.
సినిమాలో పాటలు, యాక్షన్ స్వీకెన్స్‌కు భారీ ప్రశంసలు దక్కాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, శ్రీమణి, కాసర్ల శ్యామ్ వంటి హేమాహేమీలు ఈ సినిమాకు పాటలు రాశారు. ఈ మూవీలో సిధ్ శ్రీరామ్ పాడిన పాట యూట్యూబ్‌లో 22 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇక సెకండాఫ్‌లో ఊహించిన ట్విస్టులతో ఆడియన్స్ థ్రిల్‌కు గురవుతారు. క్లైమాక్స్‌లో లాస్ట్ 20 మినిట్స్ ఉద్వేగభరితంగా సాగుతుంది. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ సీన్స్‌కు ఆడియన్స్ కంటతడి పెడతారు. శశిధర్ వేమూరి రాసిన డైలాగ్స్ ఎంతో లోతైన, భావోద్వేగంతో ఉంటాయి. కథకు తగ్గ నిర్మాణ విలువలు ఉండడంతో థియేటర్స్‌లో ఆడియన్స్‌ను మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. నేటి రాత్రి నుంచి ఆహాలో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి