మరోసారి తాతయ్య అయిన నందమూరి బాలకృష్ణ

నందమూరి కుటుంబంలోకి మరో వారసుడు వచ్చేసాడు. నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్వినికి కుమారుడు పుట్టడంతో .. బాలయ్య బాబు మళ్లీ తాతయ్య అయ్యారు. 

Last Updated : Mar 25, 2018, 08:29 AM IST
మరోసారి తాతయ్య అయిన నందమూరి బాలకృష్ణ

నందమూరి కుటుంబంలోకి మరో వారసుడు వచ్చేసాడు. నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్వినికి కుమారుడు పుట్టడంతో .. బాలయ్య బాబు మళ్లీ తాతయ్య అయ్యారు. ఇప్పటికే తన మొదటి కుమార్తె  బ్రాహ్మణికి దేవాంశ్ పుట్టడంతో తాతయ్య అయిన బాలకృష్ణ, ఇప్పుడు మళ్లీ అదే హోదాను కైవసం చేసుకున్నారు. మార్చి 22వ తారీఖున ఉదయానే తేజస్విని-శ్రీభరత్‌ దంపతులకు మగబిడ్డ పుట్టాడు.

తమ కుటుంబంలోకి మళ్లీ మరో వారసుడు రావడంతో నందమూరి వారిల్లు ఆనందంతో కళకళలాడింది. తేజస్విని భర్త శ్రీభరత్ గీతమ్ విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తికి మనవడు కావడం గమనార్హం. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హిందుపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు వహిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు

Trending News