Madhave Madhusudana: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘మాధవే మధుసూదన’.. ఆ ఆలోచనతో పుట్టింది స్టోరీ: బొమ్మదేవర రామచంద్రరావు

Madhave Madhusudana Release Date: బొమ్మదేవర రామచంద్రరావు దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బొమ్మదేవర రామచంద్రరావు మీడియాతో సినిమా విశేషాలను పంచకున్నారు. ఆయన మాటల్లోనే..   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 08:49 PM IST
Madhave Madhusudana: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘మాధవే మధుసూదన’.. ఆ ఆలోచనతో పుట్టింది స్టోరీ: బొమ్మదేవర రామచంద్రరావు

Madhave Madhusudana Release Date: తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే హీరోహీరోయిన్స్‌గా బొమ్మదేవర రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకత్వం వహిస్తూ రామచంద్రరావు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. నవంబర్ 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ.. చిత్రవిశేషాలను పంచుకున్నారు.  

మన్మథుడు సినిమా టైమ్‌లో అక్కినేని నాగార్జునకు తాను దర్శకుడిని కావాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పానని.. అయితే 'నీ మెంటాల్టీకి దర్శకుడు అంటే కష్టం కానీ.. నిర్మాతగా ట్రై చేయ్ అని నాగార్జున గారు సలహా ఇచ్చారు..' అని చెప్పారు. సూపర్ మూవీ సినిమా సమయంలో అనుష్కకు మేకప్ వేస్తూ 'మీరు పెద్ద హీరోయిన్ అవుతారు.. అప్పుడు నాకు డేట్స్ ఇవ్వాలి..' అని అన్నానని.. ఇలా చాలా మందిని అడిగాను గానీ.. కానీ అనుష్క మాటను నిలబెట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. 

మాధవే మధుసూదన సినిమాకు హీరోలుగా చాలామందిని అడిగానని.. అయితే మేకప్ మెన్ నుంచి డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌గా మారుతున్నానంటూ నమ్మలేదన్నారు రామచంద్రరావు. వేరే వాళ్లతో రిస్క్ ఎందుకు అని తన కొడుకుని అడిగితే హీరోగా చేస్తానని చెప్పాడని తెలిపారు. తేజ్‌కు ఓ ఏడాది ట్రైనింగ్ ఇప్పించి హీరోగా తీశానని.. ఎక్కడా కొత్త కుర్రాడు నటించినట్లుగా అనిపించదని అన్నారు. తన కొడుకుని హీరోగా చేద్దామని అయితే సినిమాను మొదలుపెట్టలేదని చెప్పారు.
 
"తెరపై మీద ఏం చూపించాలనేది డైరెక్టర్‌కు తెలుస్తుంది.. అదే సమయంలో బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్ టెన్షన్ పడుతుంటాడు. కానీ ఇక్కడ ఆ రెండూ నేనే. ముందే ఓ బడ్జెట్ అవుతుందని ప్లాన్ వేసుకున్నాను. నేను అనుకున్న బడ్జెట్‌లోనే తీశాను. ఏడాదిన్నర స్క్రిప్ట్ వర్క్ మీదే కూర్చున్నాను. నాకు కావాల్సిందే రాసుకున్నా.. నేను అనుకున్నది స్క్రీన్‌పై తీశాను.. ఒక మనిషి కోసం ఎదురుచూసి.. చూసి.. చివరకు ఆ మనిషి రాకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ స్టోరీ పుట్టింది. చివరకు ఆ మనిషి 25 ఏళ్ల తరువాత వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనే ఈ మూవీలో చూపించాం. కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది." అని దర్శక నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు తెలిపారు. 

Trending News