తాను ఎవరితోను పోటీ కాదని..తనకు తానే పోటీ అని చెప్పుకువచ్చే ప్రభాస్.. మాట్లలో కాదు చేతల్లో కూడా అది చూపిస్తానంటున్నాడు. సాహో మూవీతో బాహుబలి రికార్డును బద్దలు కొట్టేందకు ప్లాన్ తో రెడీ చేసుకున్నాడు. ఇది సాధ్యమయ్యే పనేనా అంటే ..ఎందుకు సాధ్యం కాదని ఎందకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నాడు సాహో ప్రభాస్. సినీ విశ్లేషకులు కూడా సాహోకు ఈ సీన్ ఉందంటున్నారు.
సాహోతో సాధ్యపడుతుందా ?
సాహో బహాబలి రికార్డును బద్దలు కొట్టడానికి కారణాలు చూపిస్తున్నారు సినీ విశ్లేషకులు...ఒకవైపు సాహోకు రికార్డు స్థాయి థియేటర్లు కూడా దక్కాయి. మరోవైపు టిక్కెట్ రేట్లు కూడా పెరిగాయి. వీటికి తోడు భారీ అంచనాలు ఉండనే ఉన్నాయి. పైగా బాహుబలి సాధించిన విజయంతో ప్రభాస్ కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాపులారిటీ భారీగా పెరిగిపోయింది .ఈ నేపథ్యంలో సాహో సినిమా బాహుబలి-2 వసూళ్లను అధిగమిస్తుందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది.
ఎందుకు సాధ్యం కాదు...?
మొదట్లో బాహుబలి ప్రభంజనం తర్వాత వరల్డ్ వైడ్ గా ఇండియన్ మూవీస్ కు ఇలాంటి వసూళ్లను క్రాస్ చేయడం ఎవరికీ సాధ్యం కాదనుకున్నారంతా. కానీ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సైలెంట్ గా దూసుకెళ్లి వైలెంట్ గా వసూళ్లు రాబట్టింది. బాహుబలి-2 వరల్డ్ వైడ్ వసూళ్లను క్రాస్ చేసి చూపించింది. భారత్ తో పాటు చైనాలో దంగల్ సూపర్ హిట్ అవ్వడంతో నంబర్-1 మూవీగా అవతరించడమే ఇందుకు కారణం. అయితే బహుబలి, దుంగల్ లను క్రాస్ చేయాలంటే అంతా ఆషామాషి వ్యవహారం కాదనే విషయం సాహో టీం కు తెలుసు. అందుకే టాప్ -5 మూవీస్ లో చోటు లభిస్తే చాలనే లక్ష్యంతో తెరపైకి వస్తోంది. ఇది సాధ్య పడాలన్న భారీ స్థాయిలో హిట్ అవ్వాల్సి ఉంది. మరి సాహో ఈ లిస్ట్ లో ఏ స్థానానికి ఎగబాకుతుందో చూడాలి మరి.
అత్యథిక వసూళ్లు సాధించిన టాప్-5 ఇండియన్ మూవీస్ ఇవే..
దంగల్ – రూ. 2122 కోట్లు
బాహుబలి -2 – రూ. 1788 కోట్లు
పీకే – రూ. 792 కోట్లు
2.O – రూ. 723 కోట్లు
బాహుబలి – రూ. 650 కోట్లు