Seetha Kalyana Vaibhogame Trailer: సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరోహీరోయిన్లుగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘సీతా కళ్యాణ వైభోగమే’. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. జూన్ 21న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను బలగం ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి రిలీజ్ చేశారు. సోమవారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఓ మై ఫ్రెండ్ సినిమా సమయంలో సతీష్‌తో పరిచయం ఏర్పడిందని.. ఈ మూవీ ఆలోచనను ఏడాదిన్నర క్రితమే చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుందని.. మన తెలుగు సంప్రదాయాన్ని చాటేలా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమాతో సతీష్‌కు పెద్ద విజయం దక్కాలని ఆకాంక్షించారు.
డైరెక్టర్ సతీష్ పరమవేద మాట్లాడుతూ.. తమ సినిమా ట్రైలర్ అందరికీ నచ్చిందని.. నిర్మాత హర్షిత్ రెడ్డి బలగం సినిమాతో బలాన్ని ఇచ్చారని అన్నారు. హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ ఈ మూవీతో పరిచయం అవుతున్నారని చెప్పారు.. చరణ్ అర్జున్ మంచి పాటలు ఇచ్చారని.. ప్రొడ్యూసర్ యుగంధర్‌కు సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉందన్నారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను ఉంటుందని.. యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా 90s కిడ్స్ అందరికీ నచ్చుతుందని.. ఈ మూవీ ప్రయాణంలో తమకు అన్ని రకాల ఎమోషన్స్ ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. తాము పడిన కష్టాన్ని చూసేందుకు థియేటర్‌కు రావాలని ఆడియన్స్‌ను కోరారు.
ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ మాట్లాడుతూ.. తాము చిన్న చిత్రంగా మొదలు పెట్టినా.. పెద్ద సినిమాగా మారిందన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గగన్ విహారి అద్భుతంగా నటించారని.. ఊరికి ఉత్తరాన సినిమాతో సతీష్ విజయాన్ని అందుకున్నారని చెప్పారు. ఈ మూవీ కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారని అభినందించారు. సుమన్ తేజ్, గరిమలకు ఈ సినిమాతో మంచి పేరు రానుందని.. పూర్ణాచారి అందించిన సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. గగన్ విహారి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనకు మంచి కారెక్టర్ దక్కిందని.. పాత్రల మధ్య జరిగే కథ ఇది అని చెప్పారు. మూవీలో చాలా బలమైన ఎమోషన్స్ ఉంటాయని.. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాల్సిన సినిమా అని అన్నారు. సినిమా ఆద్యాంతం ఉత్కంఠగా ఉంటుందని.. టీజర్‌కు మంచి స్పందన లభించిందని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter