Preminchoddu Movie Trailer: పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ప్రేమించొద్దు మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస కీలక పాత్రల్లో నటించగా.. శిరిన్ రామ్ దర్శక నిర్మాణంలో రూపొందింది. 5 భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించగా.. తెలుగు వర్షన్‌ను జూన్ 7న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఆ తరువాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా డిజైన్ చేశారు. బేబీ మూవీ కథ పాయింట్ తాను రాసుకున్నదని.. తన కథను కాపీ కొట్టి దర్శకుడు సాయి రాజేష్ ఆ సినిమా తీశారని డైరెక్టర్ శిరిన్ రామ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రేమించొద్దు మూవీని ఆయన ఎలా మలిచారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో మరింత అంచనాలు పెరిగాయి.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందున్న పరిస్థితి ఏంటి..? రాయ బరేలినా.. ? వాయనాడా.. ?
ట్రైలర్ విషయానికి వస్తే.. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ విద్యార్థిని ప్రేమ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల వయసులో ప్రేమలో పడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి..? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుకోవాలనే విషయాలను స్పష్టంగా చూపించినట్లు తెలుస్తోంది. సినిమాను రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించారని అర్థం అవుతోంది. స్కూల్, కాలేజ్ టైమ్‌లో ప్రేమ కథలు, ప్రేమ పేరుతో చదువును నిర్లక్ష్యం చేయడం వంటివి చూపించారు. ట్రైలర్‌లో చివరలో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ముగించారు. ఇద్దరు అబ్బాయిలు కలిసి మోసం చేసిన అమ్మాయిని హత్య చేసినట్లు చూపించారు. ఈ పాయింట్‌తో సినిమాపై మరింత ఆసక్తి కలిగించేలా చేసింది. విజువల్స్, డైలాగ్స్ అంతా నేచురాల్‌గా ఉండడంతో సమాజాన్ని తట్టిలేపేలా తెరెక్కించారని అర్థమవుతోంది. జూన్ 7న థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది ప్రేమించొద్దు మూవీ. ఆడియన్స్ తమ సినిమాను చూసి ఆదరించాలని మేకర్స్ కోరుతున్నారు.
టెక్నికల్ టీమ్:
==> రైటింగ్, ఎడిటింగ్, ప్రొడ్యూసర్, డైరెక్షన్- శిరిన్ శ్రీరామ్
==> మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్
==> బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్
==> సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి
==> సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి
==> స్క్రీన్ ప్లే - శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం
==> అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్)
==> VFX- వి.అంబికా విజయ్
==> సౌండ్ : సింక్ సినిమా, చెన్నై
==> సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్: నిఖిలేష్ తొగరి
==> PRO- చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.
Also Read: Kavya Maran Love Story: ఎస్ఆర్‌హెచ్ యంగ్ ప్లేయర్‌తో కావ్య మారన్ డేటింగ్.. ఆ క్రికెటర్ ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter