S.S.Thaman: తమన్ పై ఎవరైనా కుట్ర చేస్తున్నారా.. విడుదల కి ముందే తమన్ పాటలు లీక్..

SS Thaman : ఏదో ఒక కారణం తో వార్తల్లో నిలిచే ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇప్పుడు మరొక సారి సోషల్ మీడియా లో చర్చ కి కారణం అయ్యారు. కేవలం తమన్ స్వర పరుస్తున్న స్టార్ హీరో సినిమా పాటలు మాత్రమే ఎందుకు సోషల్ మీడియా లో లీక్ అవుతున్నాయి అని అభిమానులు చింతిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 04:09 PM IST
S.S.Thaman: తమన్ పై ఎవరైనా కుట్ర చేస్తున్నారా.. విడుదల కి ముందే తమన్ పాటలు లీక్..

Thaman : టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా తమన్ అభిమానులకు ఇప్పుడు ఒక కొత్త తలనొప్పి వచ్చి పడింది. తమన్ చేతిలో ఇప్పుడు బోలెడన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు స్టార్ హీరో సినిమాల సంగీతం భాధ్యత తమన్ చేతుల్లోనే ఉంది. గత నెల తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుండి ఒక పాట విడుదల కి ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యి రచ్చ చేసింది. 

ఎస్విసి బ్యానర్ వారు సినిమా కంటెంట్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది వారి బ్యానర్ లో రూపు దిద్దుకుంటున్న సినిమా నుండే పాట లీక్ అవ్వడం ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. దీంతో చేసేది లేక సినిమా విడుదల తేదీతో సంబంధం లేకుండా చిత్ర బృందం దీపావళి సందర్భంగా ఈ పాటని ముందే విడుదల చేయాల్సి వస్తుంది. 

ఇదిలా ఉండగానే ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా ఆడియో కూడా లీకల బారిన పడింది. ఆడియో అంత స్పష్టంగా లేకపోయినప్పటికీ లిరిక్స్, ఇన్స్ట్రుమెంట్లు విని అది ఖచ్చితంగా మహేష్ బాబు సినిమాలోనిదే అని అర్థమైపోతుంది. సర్కారు వారి పాట సినిమా టైం లో కళావతి పాట విషయంలో కూడా అదే జరిగింది. అది కూడా తమన్ సంగీతం అందించిన పాటే కావడం గమనార్హం.

అదృష్టవశాత్తు సితార బ్యానర్ వారు చాలా త్వరగా స్పందించి ఆ పాటని ఎక్కువగా వైరల్ చేస్తున్న ట్విట్టర్ హ్యాండిల్స్ గురించి లీగల్ గా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాల సంగీతం ఇలా సోషల్ మీడియాలో లీక్ కావడం అందరినీ షాక్ కి గురి చేసింది. 

ఈ నేపథ్యంలోనే కావాలనే ఎవరైనా తమన్ మీద కుట్ర పన్నుతున్నారా అని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. తమన్ పాటల విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే ఎవరైనా కావాలని తనని టార్గెట్ చేయాలని అనుకున్నా కూడా సినిమా కంటెంట్ మొత్తం ప్రొడక్షన్ టీం దగ్గరే ఉంటుంది. కానీ ఆ కంటెంట్ ఎలా బయటకు వస్తుందో మాత్రం అర్థం కావడం లేదు. 

ఇప్పటినుండి అయినా ఇలాంటివి జరగకుండా నిర్మాతలు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తమన్ చేతుల్లో ఉన్న సలార్ పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇలా జరగకూడదు అని ఫాన్స్ ఆశిస్తున్నారు.

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News