అమ్మాయి కళ్ళకు 50 లక్షల మంది 'ఫిదా'

వాలెంటైన్స్ డే వస్తున్న సందర్భంగా చాలామంది ఆన్‌లైన్ ప్రేమికులు ఇటీవలి కాలంలో ఓ వీడియోని సోషల్ మీడియాలో తెగ పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Last Updated : Feb 13, 2018, 09:54 PM IST
అమ్మాయి కళ్ళకు 50 లక్షల మంది 'ఫిదా'

వాలెంటైన్స్ డే వస్తున్న సందర్భంగా చాలామంది ఆన్‌లైన్ ప్రేమికులు ఇటీవలి కాలంలో ఓ వీడియోని సోషల్ మీడియాలో తెగ పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మలయాళ సినిమాకి సంబంధించిన ఆ వీడియో సాంగ్ క్లిప్‌లో ఓ అమ్మాయి తన కళ్ళతో ఎలా ఓ అబ్బాయి మనసును దోచుకుంటుందో చూస్తే.. ఎవరైనా వహ్వా అనక మానరు.

‘ఒరు అదర్ లవ్‌’ అనే సినిమాకి సంబంధించిన ఈ వీడియో క్లిప్‌లో నటించిన అమ్మాయి పేరు ప్రియా ప్రకాష్ వారియర్. కేవలం తన కళ్ళతోనే ఫీలింగ్స్ పంచుకుంటూ ఆ అమ్మాయి చేసిన మేజిక్‌కి ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది ఫ్లాట్ అయిపోయారు.  ‘మాణిక్య మలరయ పూవి’ అని సాగే పాటలో ఆ అమ్మాయి కన్నుకొట్టిన సన్నివేశం యూత్‌ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. 

ఒక్క రోజే యూట్యూబ్‌‌లో ఆ వీడియో పొందిన వ్యూస్ ఎన్నో తెలుసా.. అక్షరాలా 5 మిలియన్లు. ఈ వీడియో వైరల్ అయ్యాక.. ఇప్పటికే ఆ అమ్మాయి పేరు మీద ఫ్యాన్ పేజీలు కూడా ప్రారంభించేశారు అభిమానులు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాటతో ఒక్క రోజులోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా వారియర్. 

 

 

Trending News