Saindhav world wide closing collections: సంక్రాంతి సినిమాల్లో ఎలాంటి బజ్ లేకుండా విడుదలై సోది లేకుండా పోయిన మూవీ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మూవీ 'సైంధవ్'. మొత్తంగా సంక్రాంతి సినిమాల పోటీలో సైంధవ్ అడ్రస్ లేకుండా పోయింది. మొత్తంగా వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
'సైంధవ్' మూవీ లాస్ట్ ఇయర్ చివర్లో విడుదల కావాల్సింది. కానీ ప్రభాస్ 'సలార్' కారణంగా సంక్రాంతి బరిలో విడుదలైంది. అయితే పండగ సీజన్‌లో హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలు విడుదలయ్యాయి. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'సైంధవ్' మూవీకి మంచి టాక్ వచ్చినా పోటీలో పెద్ద సినిమాలు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అడ్రస్ గల్లంతయింది.
ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ విషయానికొస్తే.. ఈ మూవీలో యాక్షన్ కమ్ పాప సెంటిమెంట్ పాళ్లు ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న సంక్రాంతి సీజన్‌లో ఇలాంటి సినిమాలకు స్కోప్ లేదనే విషయం స్పష్టమైంది. తన బేస్ కుటుంబ ప్రేక్షకులకు దూరంగా ఈ సినిమా ఉండటం సైంధవ్‌కు నెగిటివ్‌గా మారింది.
ఇక 'సైంధవ్' సినిమా వెంకటేష్ కు 75వ సినిమా. తన లాండ్ మార్క్ మూవీని దర్శకుడు శైలేష్ కొలను బాగానే తెరకెక్కించినా.. హీరోకు విలన్స్ ఎందుకు భయపడతారనే విషయాన్ని స్క్రీన్ పై కన్విన్స్‌గా చెప్పడంలో తడబడ్డాడు. శైలేష్ కొలను గత రెండు చిత్రాలు 'హిట్ -1, హిట్ -2 చిత్రాలను పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈయన.. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సరికొత్తగా ప్రెజెంట్ చేసాడు. ఇందులో హీరో పేరు 'సైంధవ్ కోనేరు' అలియాస్ సైకో అని పేరు పెట్టడం కూడా పెద్ద మైనస్‌గా మారింది. ఈ సినిమా ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ముఖ్యంగా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌లను ఏ సినిమా పోటీలో లేకుండా సోలోగా రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం అయినా దక్కేది. కానీ సంక్రాంతి సీజన్ అంటూ ఎగబడి మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా తన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనున్న 'సైంధవ్' వెంకటేష్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, జిషుసేన్ గుప్తా నటించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ ఫీమేల్ లీడ్ పాత్రల్లో కనిపించారు. మొత్తంగా రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.35 కోట్ల షేర్ (రూ. 19.15 కోట్ల గ్రాస్) మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా బయ్యర్స్‌కు రూ. 15.65 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఇక సైంధవ్ మూవీ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook