Telangana Film Chamber Of Commerce Fires on Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో ముసలం ఏర్పడినట్లే కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు సంబంధించి నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిందని భావిస్తూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలా షూటింగ్స్ నిలిపివేయాలని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మండిపడ్డారు.
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన ఆయన షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపునిచ్చిన నిర్మాతల మీద ఫైరయ్యారు. ప్రస్తుతం తమ ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలోని 50 మంది నిర్మాతలు సినిమాలు షూటింగ్ చేస్తున్నారని తాను కూడా ఒక సినిమా షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆకస్మికంగా షూటింగ్స్ నిలిపివేస్తే వర్కర్స్ సహా మిగతా వారందరికీ ఇబ్బంది కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగ్స్ నిలిపివేస్తారని మీడియాలో వార్తలు చూశామని అసలు షూటింగ్ ఎందుకు నిలిపిస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో అందరూ ఉన్నామని అన్నారు. కొందరు నిర్మాతలు తమ స్వార్థం కోసం ముఖ్యమంత్రిని ఒకటికి నాలుగు సార్లు కలిసి టికెట్ రేట్లు పెంచుకున్నారని ఇప్పుడు వాళ్లే థియేటర్స్ కు జనం రావడం లేదని షూటింగ్స్ నిలిపివేయాలని అంటున్నారని పేర్కొన్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావడం లేదని, వారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్స్ నిలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదని ఓటీటీలకు సినిమాలు ఇవ్వద్దు అంటున్నారు కానీ మా చిన్న సినిమాలకు మీరు థియేటర్స్ ఇవ్వరు మరి ఓటీటీలకు సినిమాలు ఇవ్వకూడదు అంటే చిన్న నిర్మాతలు ఎలా బతకాలి అని ప్రశ్నించారు. మీకు లాభాలు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండి ఇబ్బంది వస్తే రూల్స్ మార్చడం షూటింగ్స్ నిలిపివేయాలి అనడం కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆ నలుగురు నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అవతారం ఎత్తి అన్ని చేస్తున్నారని వాళ్ళ స్వార్థమే తప్ప ఎప్పుడూ ఎవరికీ సపోర్ట్ చేయలేదని అన్నారు.
వాళ్లకు వాళ్లే మీటింగ్స్ పెట్టుకుని ఒక నిర్ణయానికి రావడం దాన్ని ప్రకటించడం తప్పని ఈ విషయంలో తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. షూటింగ్స్ కచ్చితంగా జరిగి తీరతాయని ఎవరైనా షూటింగ్ ఆపితే ప్రభుత్వం ద్వారా ఛాంబర్ ద్వారా ఎదుర్కొంటామని అన్నారు.. ముఖ్యమంత్రుల దగ్గరకు హీరోలను తీసుకువెళ్లి టికెట్ రేట్లు పెంచింది మీరే ఒక సినిమా హిట్ కాగానే పోటీపడి హీరోలకు రెమ్యునేషన్స్ పెంచేది మీరే అని అన్నారు. అవసరం అయితే మీరు సినిమాలు తీయడం ఆపేయండి అంతే కానీ ఇండస్ట్రీని బంద్ చేయమనడానికి మీరు ఎవరు అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరికి వాళ్లు నిర్ణయాలు తీసుకుని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన పేర్కొన్నారు.
Also Read: Malaika Arora: మలైకాకు షాక్.. అక్కడ చేయి పెట్టబోయిన వ్యక్తి.. దెబ్బకు జడుసుకుందిగా!
Also Read: Mahesh Babu: కొత్త వ్యాపారంలోకి మహేష్ బాబు.. ఆ బడా సంస్థతో కలిసి పెద్ద ప్లాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook