Bhari Taraganam Movie : కమెడియన్ అలీ ఇంటి నుంచి మరో హీరో.. ముందుకు వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి

Bhari Taraganam Trailer కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతోన్నాడు. సదన్ అనే వ్యక్తి అలీకి కాస్త దగ్గరి బంధువే. ఇప్పుడు అతను హీరోగా రాబోతోన్న భారీ తారాగణం అనే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2023, 04:44 PM IST
Bhari Taraganam Movie : కమెడియన్ అలీ ఇంటి నుంచి మరో హీరో.. ముందుకు వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి

Bhari Taraganam Trailer కమెడియన్ అలీ దగ్గరి బంధువు అయిన సదన్ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతోన్నాడు. భారీ తారాగణం అంటూ రాబోతోన్న ఈ మూవీలో సదన్ నటిస్తున్నాడు. సదన్ సరసన దీపికా రెడ్డి, రేఖ నిరోషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ట్రైలర్ అనంతరం.. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి లు మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని చాలా బాగా తెరకెక్కించారని అన్నాడు. ఇందులో ఆలీ నటించాడని, తనకు ఇష్టమైన  బాబా గారి కొడుకు ఇందులో హీరో గా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. 

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉందని మెచ్చుకున్నాడు. కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మా అన్న కొడుకు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తను ఇలాగే మంచి చిత్రాలలో నటించి పెద్ద హీరో అవ్వాలని  కోరుకుంటున్నాను అని అన్నాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News