Mahesh Babu: అభిమాని పాలిట మహేశ్‌ బాబు దేవుడు.. పేదింట చదువుల వెలుగులు నింపిన సూపర్‌స్టార్‌

Mahesh Babu Helps To His Die Fan Children Education: అభిమానులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే హీరో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. ఆ హీరో మరో మంచి పని చేసి ఓ కుటుంబాన్ని ఆదుకుని అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 19, 2024, 06:54 PM IST
Mahesh Babu: అభిమాని పాలిట మహేశ్‌ బాబు దేవుడు.. పేదింట చదువుల వెలుగులు నింపిన సూపర్‌స్టార్‌

Mahesh Babu Helps: నటుడిగా ఎంత ఎదిగినా.. ఎంత సంపాదించినా అభిమానులను మాత్రం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. తాజాగా మరో అభిమాని కుటుంబానికి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అండగా నిలిచారు. అనారోగ్యానికి గురయిన తన అభిమానిని ఆసరా అయ్యారు. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి కొండంత అండగా నిలబడ్డారు. మరోసారి మానవత్వం చాటుకుని మహేశ్‌ బాబు నిజమైన హీరో అనిపించుకున్నారు.

Also Read: O Manchi Ghost: థియేటర్లకు రండి.. హాయిగా నవ్వుకుని వెళ్లండి: OMG మూవీ టీమ్

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన కాకర్లమూడి రాజేశ్‌ మహేశ్‌ బాబుకు వీరాభిమాని. అతడికి భార్య సుజాత ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహేశ్‌పై ఉన్న అభిమానంతో తన ముగ్గురు కుమారులకు రాజేశ్‌ సినిమా పేర్లు పెట్టారు. మహేశ్‌ సినిమాలైన అర్జున్‌, అతిథి, ఆగడు పేర్లను తన కుమారులకు పెట్టారు. పేదరికంలో మగ్గుతున్న రాజేశ్‌ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తన పిల్లలను చదివించలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతడి పెద్ద కుమారుడు అర్జున్‌ చెప్పుల దుకాణంలో పనికి కుదిరాడు.

Also Read: Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?

తన అభిమాని కుటుంబం తీవ్ర కష్టాల్లో ఉండడంతో చలించిపోయిన మహేశ్‌ బాబు వెంటనే స్పందించారు. తన వ్యక్తిగత బృందాన్ని రాజేశ్‌ గ్రామానికి పంపించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రాజేశ్‌ మరో ఇద్దరు కుమారులు అతిథి, ఆగడు పిల్లలను ఓ పెద్ద పాఠశాలలో చేర్పించారు. పిల్లల చదువు బాధ్యత తాను చూసుకుంటానని తన బృందం ద్వారా రాజేశ్‌కు మహేశ్‌ బాబు భరోసా ఇచ్చారు. పిల్లల యూనిఫామ్స్‌, బట్టలు, తిండి ఇలా అన్ని ఖర్చులు మహేశ్ బాబు చూసుకుంటానని పాఠశాల యాజమాన్యానికి చెప్పారు. దీంతో ఆ కుటుంబం ఉబ్బితబ్బిబైంది. తమ అభిమాన హీరో కొండంత అండగా నిలబడడంతో రాజేశ్‌ కుటుంబం ఆనంద భాష్పాలు రాల్చాయి. 

తమ హీరో రాజేశ్‌ కుటుంబానికి అండగా నిలవడం చూసి మహేశ్‌ బాబు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    అందుకే మేం మహేశ్‌ అభిమానులమని గల్లా ఎగురువేసుకుని తిరుగుతామని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే కష్టాల్లో ఉన్న రాజేశ్‌ నివాసానికి చేరుకుని మాట్లాడుతున్నారు. కాగా రాజేశ్‌ అనారోగ్యంతో ఉండడంతో మహేశ్‌ అభిమానులుగా అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని చెబుతున్నారు. దీంతో చందాలు వేసుకుంటూ రాజేశ్‌కు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News