Sonal Chauhan: నాగార్జున 'ఘోస్ట్​'లో ఛాన్స్ కొట్టేసిన సోనాల్

Sonal Chauhan:  హీరోయిన్ సోనాల్ చౌహాన్ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. ఈ అమ్మడు తాజాగా నాగార్జున 'ది ఘోస్ట్‌' చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 10:46 AM IST
  • నాగార్జున లేటేస్ట్ చిత్రం 'ది ఘోస్ట్‌'
  • ఇందులో హీరోయిన్ గా ఎంపికైన సోనాల్ చౌహాన్
Sonal Chauhan:  నాగార్జున 'ఘోస్ట్​'లో ఛాన్స్ కొట్టేసిన సోనాల్

Akkineni Nagarjuna-Sonal chauhan: ప్రస్తుతం నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో 'ది ఘోస్ట్‌' (The Ghost) అనే చిత్రం తెరకెక్కుతోంది. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతుంది.

ఈ సినిమాలో.. హీరోయిన్ గా తొలుత కాజల్‌ను (Kajal Agarwal) ఎంపిక చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొంది. దీంతో ఆ పాత్ర కోసం అమలాపాల్‌, జాక్వెలిన్‌ పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడీ పాత్రను సోనాల్‌ చౌహాన్‌ (Sonal Chauhan) దక్కించుకుందని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. తన పాత్ర నచ్చడంతో సినిమా చేసేందుకు సోనాల్‌ అంగీకరించినట్లు తెలిసింది. ఇందులో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించినున్నట్లు వినికిడి. 

Also Read: Payal Rajput Photos: బుల్లిగౌనులో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

‘లెజెండ్‌’, ‘పండగ చేస్కో’, ‘రూలర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన భామ సోనాల్‌ చౌహాన్‌. ప్రస్తుతం ఆమె వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లతో కలిసి ‘ఎఫ్‌3’ సినిమాలో సందడి చేస్తోంది. తాజాగా నాగార్జునతో (Akkineni Nagarjuna) కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. మోడల్ గా తన కేరీర్ ను స్టార్ చేసిన సోనాల్ చౌహాన్ 2005 బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోసర్, యాక్టర్ హిమేష్ రేష్మియా (Himesh Reshmiya)‘'ఆప్ కా సరూర్’'మూవీలో తొలిసారిగా  స్క్రీన్ పై మెరిసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News