Son of India Hero Manchu Mohan Babu warns Two Telugu Heros: 'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, నిర్మాతగా, తండ్రిగా తనకంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానంను సంపాదించారు. ఆయన నటన, డైలాగులకు ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించారు. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
'సన్ ఆఫ్ ఇండియా' సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ తనపై వస్తున్న ట్రోలింగ్స్‌పై ఘాటుగానే స్పందించారు. ఓ ఇద్దరు హీరోలే పనిగట్టుకుని మరీ తనపై ట్రోలింగ్స్ చేస్తున్నారని, ఎన్నడున్నా వారికి శిక్ష తప్పదు అని అన్నారు. 'ఇటీవల కాలంలో సెలెబ్రిటీలపై ట్రోలింగ్స్, మీమ్స్ చాలానే ఆవస్తున్నాయి. కొన్నింటిని చూసి నేను చాలా బాధ పడుతున్నా. ట్రోల్స్, మీమ్స్ సరదాగా నవ్వుకునేలా ఉండాలే తప్ప..ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు' అని అన్నారు.
'నిజం చెప్పాలంటే నేను ట్రోలింగ్స్, మీమ్స్‌ను పెద్దగా పట్టించుకోను. నా మొబైల్‌కు ఎవరైనా పంపినప్పుడు చూస్తాను. కొన్నిసార్లు అవి హద్దులు మీరుతున్నాయి. అలాంటి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుంది. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయవచ్చునేమో లేదో నాకు తెలియదు కానీ.. వ్యగ్యంగా ట్రోల్ చేయడం మాత్రం బాధాకరంగా ఉంటుంది. ఓ ఇద్దరు హీరోలు కొంత మందిని అపాయింట్ చేసుకుని అదే పనిగా ట్రోలింగ్ చేయిస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. ఆ ఇద్దరు ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు. చాలా బాధపడతారు' అని మోహన్ బాబు పేర్కొన్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో ప్రైవేట్ జైలు అనే కాన్సెప్ట్‌ను చూపించబోతున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఓటీటీ కోసమని నిర్మించినా.. ఇప్పుడు థియేటర్స్‌లోనూ విడుదల చేస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా నిడివి ఒక గంట 29 నిమిషాలే. ఇక మోహన్ బాబు వరుసగా నాలుగు సినిమాలు చేయబోతున్నారు.
Also Read: Tollywood Films: వేసవిలో వినోదపు తుఫాన్.. టాలీవుడ్లో వరుసగా విడుదల అవుతున్న పెద్ద సినిమాలు ఇవే!
Also Read: Google Pay Loans: గూగుల్ పే బంపరాఫర్.. చిటికెలో రూ. 1 లక్ష లోన్