saif ali khan stabbing case update: బాలీవుడ్ నటుడు సైఫ్ పై బాంద్రాలోని ఆయన నివాసంలో దుండగుడు రాత్రి పూట వచ్చి చోరీకి యత్నించాడు. ఈ క్రమంలో సైఫ్ తో పెనుగులాట సంభవించింది. అతను కత్తితో సైఫ్ మీద ఇష్టమోచ్చినట్లు దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గట్టిగా అరుపులు కేకలతో సైఫ్ కొడుకు మేల్కొన్నాడు. ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆతర్వాత ఒళ్లంతా రక్తంతో ఉన్న తండ్రిని అతని కుమారుడు లీలావతి ఆస్పత్రికి తరలించాడు.
వైద్యులు సైఫ్ కు రెండు సర్జరీలు చేశారు. వెన్నుపాములో ఇరుక్కున్న కత్తిని తొలగించారు. ప్రస్తుతం అతను ప్రాణపాయం నుంచి బైటపడ్డాడు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ పై దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు.. 300 మంది పోలీసులు రంగంలోకి దిగి.. 600 ల వరకు సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. ఆగంతుకుడి కదలికల్ని గుర్తించాడు. అతను ట్రైన్ లో ముంబైకు వెళ్లాడు.
థానెలో ఒక గదిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. థానెలో వాటర్ బాటిల్, పరోటాలను ఫోప్ పే తో కొనుగోలు చేశారు. పోలీసులు.. దీని ఆధారంగా అతగాడి నంబర్ ను గుర్తించి.. ట్రెస్ చేసి షెహబాజ్ సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఎదుట హజరుపర్చాగా ఐదు రోజుల పాటు రిమాండ్ విధించింది.
ముఖ్యంగా అతని యూపీఐ పేమెంట్ చేయడం వల్ల నిందితుడు దొరికిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఆగంతకుడ్ని అదుపులోకి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీన్ రీక్రియేషన్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఐదు రోజుల విచారణ తర్వాత నివేదిక కోర్టు ఎదుట ఉంచుతామని బాంద్రా పోలీసులు ఒక ప్రకటలో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter