Ram Charan Tej to Do Movie with Mufti Director Narathan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ఫలితాన్ని అందించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా మీద రామ్ చరణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద ముందు నుంచి కాస్త కన్ఫ్యూజన్ ఉంది. యువి క్రియేషన్స్ సంస్థ రామ్ చరణ్ తేజ 16వ సినిమా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఉండబోతుందని గత ఏడాది అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని వార్తలు వస్తున్నాయి, ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు, కానీ రామ్ చరణ్ తేజ ఇప్పుడు ఒక కన్నడ డైరెక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు కన్నడ నాట మఫ్టీ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న నారదన్. శివ రాజ్ కుమార్ హీరోగా 2017 వ సంవత్సరంలో విడుదలైన మఫ్టీ సినిమా కన్నడ నాట బ్లాక్ బస్టర్ గా నిలిచి, వసూళ్ల వర్షం కూడా కురిపించింది ఇక ఆ సినిమా తర్వాత దర్శకుడు మరో కథ సిద్ధం చేసుకోవడానికి ఇంత సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు కల్చర్ పెరిగిపోయిన నేపథ్యంలో తన కథకు రామ్ చరణ్ అయితే న్యాయం చేయగలరని భావించిన నారదన్ తన గురువు ప్రశాంత్ నీల్ సహాయంతో రామ్ చరణ్ కి నేరేషన్ ఇచ్చారు అనే ప్రచారం జరుగుతోంది.
ప్రశాంత్ నీల్ దగ్గర ఉగ్రం అనే సినిమాకు నారదన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్వయంగా మఫ్టీ అనే సినిమా తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ తేజ్ తో సన్నిహిత్య సంబంధం ఏర్పరచుకున్న ప్రశాంత్ నీల్ తన శిష్యుడు రామ్ చరణ్ తో సిట్టింగ్ ఏర్పాటు చేశాడని, ఇప్పటికే కథ విన్న రామ్ చరణ్ తేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో తన 16వ సినిమాగా రామ్ చరణ్ ఈ సినిమానే చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అది యూవీ క్రియేషన్స్ సంస్థలో రూపొందుతుందా లేక మరి ఏదైనా మరో ప్రొడక్షన్ హౌస్ ఎంట్రీ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కన్నడ దర్శకుడు కాబట్టి ఖచ్చితంగా తెలుగు, కన్నడ భాషలో అయితే సినిమా విడుదలవుతుంది. కాబట్టి మిగతా మూడు భాషల్లో కూడా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా నార్త్ లో కూడా మంచి క్రేజ్ దక్కించుకోవడం ఇప్పుడు శంకర్ చేసే సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో రామ్ చరణ్ నారదన్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Chiranjeevi Watched God Gather: గాడ్ ఫాదర్ వీక్షించిన చిరంజీవి.. డైరెక్టర్ పై షాకింగ్ రియాక్షన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి