Game Changer: రామ్ చరణ్ సినిమా హిందీలో ఫ్లాప్ అవ్వనుందా? కారణం ఇదే

Game Changer : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాలీవుడ్ థియట్రికల్ రైట్స్ 75 కోట్లకు అమ్ముడయ్యాయి. నిర్మాతలకి ఇది మంచి విషయమే అయినప్పటికీ డిస్టిబూటర్లు మాత్రం కి ఇది రిస్క్ అని చెప్పుకోవాలి. ఇంత భారీ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోగలగా లేదా అని అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 20, 2024, 12:47 PM IST
Game Changer: రామ్ చరణ్ సినిమా హిందీలో ఫ్లాప్ అవ్వనుందా? కారణం ఇదే

Game Changer : 2024 సెకండ్ హాఫ్ లో స్టార్ హీరోల సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల కి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో మొదటగా బరిలోకి దిగనున్న సినిమా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప ది రూల్ కాగా, తర్వాత  పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెస్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

బాలీవుడ్ బ్యూటీ కీయార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తోంది. వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్ సరసన కియారా రెండవసారి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా హిందీలో కూడా విడుదల అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం నార్త్ ఇండియాలో చిత్ర థియట్రికల్ రైట్స్ ను ఏ ఏ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి అనిల్ తడాని 75 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చిత్ర బృందానికి ఇది నిజంగా ఒక మంచి డీల్ అని చెప్పవచ్చు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద అంత వసూళ్లు నమోదు చేయగలదా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. 

75 కోట్ల బిజినెస్ జరగడంతో సినిమా కేవలం హిందీలోనే 150 నుంచి 160 కోట్ల నెట్ కలెక్షన్ల ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభాస్ సలార్ (135 కోట్లు) సాహో (130 కోట్లు) కంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లను నమోదు చేసుకుంటే తప్ప కనీసం బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోవాలని పరిస్థితి ఏర్పడింది.

ఇక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కనీసం 180 కోట్లు దాకా కలెక్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది డిస్ట్రిబ్యూటర్లతో డిస్కషన్లు చేసిన చిత్ర నిర్మాత దిల్ రాజు ఫైనల్ గా ఏ ఏ ఫిలిమ్స్ కి ఈ సినిమా రైట్స్ ను అమ్మారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా తర్వాత హిందీలో విడుదలవుతున్న రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఇదే. ఇక హీరోయిన్ కియారా అద్వానీ కూడా బాలీవుడ్ లో మంచి పేరున్న స్టార్ హీరోయిన్. అయినప్పటికీ ఈ సినిమా బాలీవుడ్ లో ఆ రేంజ్ కలెక్షన్లు నమోదు చేసుకోగలరా లేదా అని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. 

భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది దివాళి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో అనిల్ తడానీ పెద్ద రిస్క్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఈ రిస్క్ ఎంతవరకు సక్సెస్ తెచ్చి పెడుతుందో వేచి చూడాలి.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News