Sarangadariya Teaser: సీనియర్ నటుడు రాజా రవీంద్ర కీలక పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. మేలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘అందుకోవా...’, ‘నా కన్నులే..’ అనే సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను యంగ్ హీరో శ్రీవిష్ణు రిలీజ్ చేసి.. మూవీ యూనిట్‌ను అభినందించారు.
Also Read: Krithi Shetty viral pics: హాట్ నెస్ తో సమ్మర్ ను మరింత హీటెక్కిస్తున్న బేబమ్మ, లేటెస్ట్ పిక్స్ వైరల్
టీజర్ విషయానికి వస్తే.. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా రూపొందించినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో ఓ వ్యక్తి సంసారాన్ని నడిపిస్తుంటాడు. సమాజంలో పరువుగా ఉంటే చాలనుకుని బతికే ఆ వ్యక్తికి.. కొడుకులు, కూతురి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సమాజం ఆయన్ని నిలదీసే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఆయన ఏం చేశాడు..? తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు..? అనే పాయింట్‌తో సారంగదరియా సినిమా రూపొందించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసర్స్ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. సారంగదరియా మూవీ టీజర్‌ను రిలీజ్ చేసినందుకు హీరో విష్ణుకు థ్యాంక్స్ చెప్పారు. సినిమాలో మనసును హత్తుకునే భావోద్వేగాలుంటాయని చెప్పారు. మే నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని.. త్వరలోనే డేట్‌ను అనౌన్స్ చేస్తామన్నారు. దర్శకుడు పండు మాట్లాడుతూ.. డైరెక్టర్‌గా ఇది తనకు తొలి చిత్రం అని చెప్పారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుందన్నారు. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ , మోహిత్, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డైలాగ్స్ వినయ్ కొట్టి రాయగా.. ఎడిటర్‌గా రాకేష్ రెడ్డి పనిచేశారు. సంగీత దర్శకుడిగా ఎం.ఎబెనెజర్ పాల్ వర్క్ చేయగా.. సినిమాటోగ్రఫర్‌గా సిద్ధార్థ స్వయంభు వ్యవహరించారు. పాటలు రాంబాబు గోశాల, కడలి రాశారు.
Also Read: Weight loss Tips: ఈ 6 కూరగాయల్లో నీరు అధికం.. ఇలా తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook