కేరళ పాప ప్రియ ప్రకాష్ కొత్త వీడియో మరో సంచలనం!

యూట్యూబ్‌లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోన్న ఓరు అడార్ లవ్ టీజర్ 

Last Updated : Feb 14, 2018, 04:19 PM IST
కేరళ పాప ప్రియ ప్రకాష్ కొత్త వీడియో మరో సంచలనం!

ప్రియ ప్రకాశ్ వారియర్ ! యావత్ భారత నెటిజెన్స్‌కి, వాట్సాప్ యూజర్లకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరిది. గత రెండు, మూడు రోజులుగా ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఈ కేరళ సినీ నటి.. తన కొంటె చూపులతో కోట్లాదిమంది నెటిజెన్స్‌ని ఫిదా అయ్యేలా చేసింది. అంతేకాకుండా ఒకే ఒక్క సాంగ్ వీడియోతో సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో టాప్ హెడ్ లైన్స్‌కి ఎక్కింది. గిలిగింతలు పెట్టేలా ప్రియ ప్రకాష్ వారియర్ నవ్విన అరనవ్వు, విసిరిన కొంటె చూపుల నుంచి కుర్రకారు ఇంకా బయటపడకముందే ఇప్పుడు మరో వీడియోతో ఆడియెన్స్ ముందుకొచ్చింది.

 

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియ ప్రకాష్‌కి ఓవర్ నైట్‌లో వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు అదే "ఓరు అడార్ లవ్" సినిమా మేకర్స్ తాజాగా టీజర్‌ని విడుదల చేశారు. మొన్న మాణిక్య మలరాయ పూర్వి సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో అంతకన్నా వేగంగా ఈ టీజర్ మరో సంచలనమైన మార్క్ దిశగా దూసుకుపోతోంది. 

ఫిబ్రవరి 13న రిలీజైన ఈ టీజర్‌కి ఇంకా 24 గంటలు కూడా గడవకముందే.. దాదాపు 3.8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్‌పై రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్‌లో ప్రియ ప్రకాష్ తన బాయ్‌ఫ్రెండ్‌కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన తీరు మళ్లీ నెటిజెన్స్‌ని ఫిదా చేస్తోంది. ప్రియ ప్రకాష్ పర్ పార్మెన్స్ పుణ్యమా అని ఆ సినిమా డైరెక్టర్ ఒమర్ లులుకి కూడా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. అఫ్‌కోర్స్.. సినిమాలో ప్రియ చేసిన ప్రతీ కొంటె పనికి వెనుకున్న దర్శకుడు అతడే అయినా.. క్రేజ్ మాత్రం ప్రస్తుతం ఆమె చుట్టే తిరుగుతోంది. 

Trending News