వైవిద్య భరితమైన పాత్రలతో అందరిని ఆకట్టుకునే నటుడు ప్రకాష్ రాజ్ ( Prakash Raj ) కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంలోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఒక పేద విద్యార్థినికి విదేశాల్లో చదువుకోవడానికి సహాయం చేసి మంచి నటుడు మాత్రమే కాదు.. మనసున్నోడు కూడా అనిపించుకున్నాడు. ప్రతిభావంతులైన తిగిరిపల్లి సిరి చందనకు విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ ( Masters Degree ) చేసి జీవితంలో గొప్పస్థాయికి చేరాలనేది కల. కానీ ఆమెకు చదువుల తల్లి సరస్వతి మాత కటాక్షం ఉన్నప్పటికీ.. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా విదేశాలకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. Also read : Actors remunerations cut: సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్
సోషల్ మీడియా ఆధారంగా ఆ నిరుపేద విద్యార్థిని ఆశయం గురించి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్.. ఆ అమ్మాయిని విదేశాల్లో చదివించే బాధ్యత తీసుకున్నాడు. ఫలితంగా యూకే మాంచెస్టర్ సిటీలోని సాల్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆ అమ్మాయికి ఉన్నత చదువులు ( Higher studies in UK ) చదువుకునే అవకాశం లభించింది.
చందన కాలేజీలో కట్టవలసిన ట్యూషన్ ఫీజు ( Tuition fee ), అలాగే ఆమె అక్కడ ఉండేందుకు అయ్యే వసతి ఖర్చులను ( Accommodation expenses ) ప్రకాశ్ రాజ్ చెల్లించారు. ప్రకాశ్ రాజ్ సహాయాన్ని అందుకున్న సిరి చందన ఆయన్ని కలుసుకుని అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. Also read : Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Prakash Raj: ప్రకాశ్ రాజ్ గొప్పమనసు.. నిరుపేద విద్యార్థినికి విదేశాల్లో చదువు