Mr Celebrity Movie: మిస్టర్ సెలెబ్రిటీ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Mr Celebrity Movie Review and Rating: పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ మిస్టర్ సెలెబ్రిటీ అనే మూవీతో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 4, 2024, 11:06 AM IST
Mr Celebrity Movie: మిస్టర్ సెలెబ్రిటీ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Mr Celebrity Movie Review and Rating: పరుచూరి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వచ్చాడు. ఆయన మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం ఈ సినిమాకు వహించారు. అక్టోబర్ 4న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. టీజర్, ట్రైలర్లు మంచి బజ్‌నే క్రియేట్ చేశాయి. మరి ఇప్పుడు ఈ మూవీ ఆడియెన్స్‌‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఓ సారి చూద్దాం.

కథ

ఎదుటి వాళ్ల జీవితాలు ఏం అవుతాయ్ అనే విషయాన్ని పట్టించుకోకుండా తన ఫేమ్, నేమ్ కోసం యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు చేస్తుంటాడు లక్కీ (సుదర్శన్). హైద్రాబాద్‌లో డూ లక్కీ అనే యూట్యూబ్ చానెల్‌తో లక్కీ పెద్ద ఇన్‌ఫ్లూయెన్సర్ అవుతాడు. ఇక మరో వైపు వైజాగ్‌లోని సోషల్ యాక్టివిస్ట్ లలిత (శ్రీ దీక్ష)కు వింత అనుభవం ఎదురవుతుంది. కలలో ఆమెను ఎవరో మానభంగం చేసినట్టుగా అనిపిస్తుంది. పదే పదే అలా అనిపించడంతో డాక్టర్‌ను, అటు నుంచి పోలీసుల్ని కలుస్తుంది. ఆ కలలో వచ్చిన వాడి బొమ్మని గీస్తే లక్కీగా పోలీసులు గుర్తిస్తారు. దీంతో లక్కీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇదొక వింత కేసులా ఉందని ఎస్సై నరహరి (రఘుబాబు) ఫేమస్ అయ్యేందుకు ట్రై చేస్తాడు. అనుకున్నట్టుగానే ఈ కేసుల మీడియాలో సెన్సేషన్ అవుతుంది. అయితే ఆ తరువాత లక్కీ నేరస్థుడు కాదని తెలుస్తుంది. కానీ మీడియా దాన్ని హైలెట్ చేయదు. అసలు లక్కీని ఇందులో ఇరికించింది ఎవరు? లలితకు అలాంటి అనుభవం ఎందుకు ఎదురైంది? ఎస్సై నరహరితో ఈ ఆటలు ఎవరు ఆడించారు? ఫేమస్ చేసి మరీ చంపుతా అని ఈ ముగ్గురికి వార్నింగ్ ఇచ్చిన ముసుగు వ్యక్తి ఎవరు? ఈ కథలో వరలక్ష్మీ పాత్ర ఏంటి? సైంటిస్ట్ పద్మశ్రీ రామచంద్రయ్య (నాజర్), జానకి (ఆమని)ల కథ ఏంటి? చివరకు ఏం జరిగింది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు

తొలి చిత్రంలో ఎవ్వరైనా సరే కాస్త తడబడతారు. సుదర్శన్ కొన్ని సీన్లలో తడబడితే.. ఇంకొన్ని సీన్లలో అవలీలగా నటించాడనిపిస్తుంది. తెరపై సుదర్శన్ బాగున్నాడు. పాటలు, ఫైట్లు, డైలాగ్స్‌ చెప్పడంలో ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ శ్రీ దీక్షకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది. దానికి తగ్గట్టు ఆమె కూడా బాగానే నటించింది. నరహరి పాత్రలో  రఘుబాబు ఆద్యంతం నవ్వించే ప్రయత్నించాడు. వరలక్ష్మీ పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే మొదటి సారనిపిస్తుంది. నాజర్, ఆమని పాత్రలు ఎమోషనల్‌గా ఉంటాయి. సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

విశ్లేషణ

ప్రస్తుతం  సోషల్ మీడియా ఎలా మనుషుల జీవితాల్ని ఆడుకుంటుందో తెలిసిందే. నిజం నాలుగు గోడల మధ్యే ఉంటే.. అబద్దం మాత్రం నాలుగు వైపులా ఉంటోంది. గాసిప్స్, రూమర్లు, పక్కవారి మీద నిందలు వేయడం, పక్కవారిని కించ పర్చేలా వ్యాఖ్యలు చేయడమే పరిపాటి. ఇలాంటి ఓ కాన్సెప్ట్‌ను దర్శకుడు ఎంచుకున్నాడు. ఓ రూమర్, గాలి మాట వల్ల ఎంత గాయం అవుతుంది.. ఎంత బాధపడతారు.. అన్నది చూపించాడు. అయితే రాసుకున్న పాయింట్‌ను, అనుకున్న కథను తెరపైకి తీసుకు రావడం‌లో కొంత వరకే సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగుతుంది. రూమర్ల వల్ల ఎవరు ఎలా ఇబ్బందులు పడతారన్నది ఓ మూడు సీన్లు చూపించాడు. ఆ తరువాత హీరో ఇంట్రడక్షన్.. ఆ తరువాత సాంగ్.. ఆపై హీరోయిన్ పరిచయం, ఆమె సమస్య గురించి చెప్పడం, లలిత ఇచ్చిన ఫిర్యాదుతో లక్కీని నరహరి అరెస్ట్ చేయడం.. ఇలా సీన్లు ముందుకు వెళ్తూనే ఉంటాయి. లక్కీ, లలిత, నరహరి పాత్రలతోనే ఫస్ట్ హాఫ్ గడుస్తుంది. ఇంట్రవెల్‌కు ట్విస్ట్ వస్తుంది. ఓ ముసుగు వ్యక్తి ఇదంతా చేయిస్తాడని తెలుసుకుంటారు. దీంతో సెకండాఫ్ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. ఆ ముసుగు వ్యక్తిని పట్టుకునేందుకు ఈ ముగ్గురూ చేసిన ప్రయత్నాలు.. ఈ ముగ్గురితో ఉన్న కనెక్షన్ రివీల్ చేసే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్.. చివరి 40 నిమిషాలు సినిమాకు ప్రాణం అని చెప్పొచ్చు.

సాంకేతికతంగానూ ఈ సినిమా మెప్పిస్తాయి. పాటలు బాగుంటాయి. మాటలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా సాగుతుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. తక్కువ లొకేషన్లలో ఈ మూవీని చక్కగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు పెట్టిన డబ్బులు, పడిన కష్టం అయితే తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రయత్నంలో మంచి చిత్రం తీసేందుకు ప్రయత్నించి.. సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది.

రేటింగ్: 2.75/5

Also Read: Supreme court: మరోసారి సుప్రీం కోర్టులో లడ్డుపై విచారణ.. తిరుమలకు చంద్రబాబు.. ఏపీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ..

Also Read: Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌ విడాకులు? పర్సనల్‌గా రాసుకున్న డైరీ పేజీ లీక్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News