Nithya Menen Pregnancy : నాలుగు సార్లు టెస్ట్ చేసుకున్నా.. పాజిటివ్ వచ్చింది.. నిత్యా మీనన్ వీడియో వైరల్

Nithya Menen Pregnancy నిన్నటి నుంచి నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నిత్యా మీనన్ ప్రెగ్నెంగ్ ఎలా అయిందంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 03:01 PM IST
  • నెట్టింట్లో నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ వార్తలు
  • ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించిన హీరోయిన్
  • అసలు విషయం చెప్పేసిన నిత్యా మీనన్
Nithya Menen Pregnancy : నాలుగు సార్లు టెస్ట్ చేసుకున్నా.. పాజిటివ్ వచ్చింది.. నిత్యా మీనన్ వీడియో వైరల్

Nithya Menen Wonder Women : నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేయడం, అందులో పాజిటివ్ వచ్చిందంటూ ప్రకటించడం అందరికీ తెలిసిందే. అయితే దీని వెనుకున్న స్ట్రాటజీ అందరూ గెస్ చేశారు. ఏదో ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అందరూ ఊహించారు. అవే ఇప్పుడు నిజమయ్యాయి. తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసమే నిత్యా మీనన్ ఇలా ప్రెగ్నెన్సీ అంటూ నాటకం ఆడిందని అర్థమైంది.

నిత్యా మీనన్ తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది. నిత్యా మీనన్ నోరా అనే పాత్రలో నటిస్తోన్నట్టుగా ఉంది. నోరా పాత్రకు సంబంధించిన హింట్ ఇచ్చింది. నాలుగు సార్లు టెస్ట చేయించుకున్నా.. అయినా పాజిటివ్ వచ్చింది.. ఇదెలా సాధ్యమైందంటూ నిత్యా మీనన్ మాట్లాడింది. అనుకోనేవే ఇలా జరుగుతుంటాయి.. అంటూ తన వండర్ వుమెన్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రకటక చేసింది. ఇది సోనీ లివ్ యాప్‌లో రాబోతోందని నిత్యా మీనన్ ప్రకటించింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nithya Menen (@nithyamenen)

మొత్తానికి నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. దీంతో ఈ రోజు వాటికి పుల్ స్టాప్ పెట్టేసింది. క్యాప్షన్ ఐడియా ఇచ్చినందుకు థాంక్స్ నోరా.. ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆన్ సోనీ లివ్ అంటూ చెప్పుకొచ్చింది. మీరంతా నిన్న కురిపించిన ప్రేమకు థాంక్స్.. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.. వండర్ వుమెన్ మీరంతా చూడాలి.. నేను ఆ క్షణాలను ఆస్వాధించాలి.. ది వండర్ వుమెన్ బిగిన్స్.. అంటూ పోస్ట్ వేసింది.

నిత్యా మీనన్ వరుసగా సినిమాలతో పలకరిస్తోంది. ఇటు ఓటీటీ, అటు సిల్వర్ స్క్రీన్‌ల మీద నిత్యా మీనన్ దుమ్ములేపేస్తోంది. మోడ్రన్ లవ్, 19 1 a  అంటూ ఇలా నిత్యా మీనన్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లో తిరు అనే సినిమాతో ధనుష్‌ పక్కన నటించి మెప్పించింది. శోభన పాత్రతో తెలుగు వారిని కూడా మెప్పించింది నిత్యా మీనన్. తమిళనాట ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Also Read : Amy Jackson Bikini Stills : అమీ.. ఏమీ అందమిది.. బికినీలో రామ్ చరణ్ హీరోయిన్ సందడి

Also Read :Sunny Leone Remuneration : దారుణంగా జిన్నా కలెక్షన్స్.. సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ కూడా రికవరీ కాలేదట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News