Naresh Pavitra Hulchul at Elurupadu: సీనియర్ నటుడు నరేష్ నటించిన సినిమాల కంటే వివాదాలతోనే ఈ మధ్య ఎక్కువగా ఫేమస్ అవుతున్నాడు. ఇప్పటికే ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్న ఆయన ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నారనే వార్త చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఆయన అధికారికంగా నాలుగో పెళ్లి చేసుకున్నా అది చెల్లదు.
ఈ విషయం తెలియక నరేష్ నాలుగో పెళ్లి చేసుకున్నాడని వారిద్దరూ ఏడడుగులు నడుస్తున్న వీడియో కూడా బయటకు వచ్చిందని అందరూ భావించారు. స్వయంగా నరేష్ షేర్ చేయడంతో ఇంకేముంది వీరు తెగించి వివాహానికి సిద్ధమయ్యారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే నరేష్ నిర్మాతగా మళ్లీ పెళ్లి అనే సినిమా ఈ మధ్యనే అనౌన్స్ చేయడంతో ఇదంతా వట్టి ప్రమోషనల్ స్టంట్ అనేది వెళ్ళిపోయింది. ఎంఎస్ రాజు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రూపొందుతోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడులో సినీ నటుడు నరేష్, పవిత్ర ఇద్దరూ సందడి చేశారు వాస్తవానికి నరేష్ తల్లి విజయనిర్మల స్వగ్రామం ఈ ఏలూరుపాడు. దీంతో బంధువుల ఇంట్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు నరేష్ ఏలూరుపాడు వచ్చారు. ఈ సందర్భంగా పవిత్రతో కలిసి నరేష్ స్థానికంగా ఉన్న అమ్మవారి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఏలూరుపాడు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ విగ్రహాలకు సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు నరేష్, పవిత్ర.
ఇక నరేష్, పవిత్ర అమ్మవారి దేవాలయం దగ్గర పూజలు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తమను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే ఇలా మళ్లీ పెళ్లి పేరుతో ఒక సినిమాను తెరమీదకు తీసుకొచ్చారు అనే ప్రచారం కూడా ఉంది. ఏమైనా అంటే సినిమా షూటింగ్ అనో ప్రమోషన్స్ అనో చెప్పచ్చు ఎవరు ఏమి మాట్లాడడానికి ఉండదు అనే ఉద్దేశంతోనే స్వయంగా నరేష్ నిర్మాతగా ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.
Also Read: Balagam Movie Brothers: ఏళ్లగా అన్నదమ్ముల స్థలం తగాదా.. బలగం చూసి ఏడ్చేసి ఒక్కటయ్యారు!
Also Read: Nayanathara Son Names: ఉయిర్, ఉలగ్..నయనతార కొడుకులకు ఇంట్రెస్టింగ్ నేమ్స్..అర్ధం ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook