Balakrishna Tongue Slip: బాలయ్య నోటి వెంట బూతు మాట.. పాపం నోరు జారాడుగా!

Nandamuri Balakrishna Tongue Slip:  నందమూరి బాలకృష్ణ నోటి వెంట బూతు మాట బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే  

Last Updated : Oct 21, 2022, 10:48 PM IST
Balakrishna Tongue Slip: బాలయ్య నోటి వెంట బూతు మాట.. పాపం నోరు జారాడుగా!

Nandamuri Balakrishna Tongue Slip in Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ చాలా సరదా సరదాగా ఉంటారు, ఈ విషయాన్ని అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కొత్త సీజన్ మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం మొదటి సీజన్ అద్భుతంగా వ్యూస్ తీసుకురాగా ఇప్పుడు ప్రస్తుతానికి రెండో సీజన్ నడుస్తోంది. మొదటి ఎపిసోడ్ కి నారా లోకేష్ చంద్రబాబు హాజరుకాగా రెండవ ఎపిసోడ్ కు సిద్దు జొన్నలగడ్డ అలాగే విశ్వక్సేన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ బూతులు మాట్లాడటం సంచలనంగా మారింది. అసలు విషయం ఏమిటంటే విశ్వక్ సేన్ తో మాట్లాడుతూ నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను నువ్వు నన్ను డైరెక్ట్ చేయమని బాలకృష్ణ అంటారు. అప్పటికప్పుడు విశ్వక్సేన్ మీకు ఫాన్స్ కావాలా? హీరోయిన్ కావాలా? అని అడుగుతానని, దానికి మీరు మింగితే షేప్ అవుట్ అవుతావు అని అనమని అంటాడు. అలాగే నందమూరి బాలకృష్ణ రిపీట్ చేయడానికి ప్రయత్నించగా ఆయన నోటి వెంట మింగితే బదులుగా ఒక బూతు మాట దొర్లింది.

అయితే ఈ విషయాన్ని మాత్రం ఎవరు అక్కడ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఇక ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేత కొరియోగ్రఫీ చేయించుకుని సిద్దు జొన్నలగడ్డ, డీజే టిల్లు సినిమాలో వేసిన స్టెప్ వేసేందుకు ప్రయత్నించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అదేమిటంటే అఖండ సినిమాలో బాలకృష్ణ షర్ట్స్ మార్చే స్టెప్పు చూసిన తర్వాతే డీజే టిల్లు సినిమాలో భాను మాస్టర్ కి అవకాశం ఇచ్చామని చెప్పుకు రావడంతో నందమూరి బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ తో చేసిన నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతానికి ట్రెండ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ గురించి అనేక విషయాలు పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 127వ సినిమా టైటిల్ కూడా చేశారు. వీర సింహారెడ్డి అనే ఒక టైటిల్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

Also Read: Vishwaksen: అమ్మాయిలు ప్లేట్లు మార్చేస్తారు.. అబ్బాయిలే మంచోళ్లు.. విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Also Read: Balakrishna: హెయిర్ స్టైల్ మీద కామెంట్స్.. హీరో సిద్దు జొన్నలగడ్డను చంపుతానన్న బాలకృష్ణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News