Naga Chaitanya Upcoming Movie: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఈ ఏడాది చైతూ.. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం చైతూ ఆశలన్నీ చందు మొండేటి సినిమాపైనే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘తండేల్’(Thandel Movie) అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన లుక్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
తాజాగా ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున విచ్చేశారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి చేపలవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా తండేల్ మూవీ రూపొందుతుంది.
The ever gracious @Sai_Pallavi92 is here at the #Thandel Muhurtham Ceremony ❤️🔥
Watch live now!
- https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @KarthikTheeda @bhanu_pratapa… pic.twitter.com/GfMxTT5fvc
— Geetha Arts (@GeethaArts) December 9, 2023
ఇటీలవ దూత వెబ్ సిరీస్‌తో (Dhootha Web series) వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజైన ఈ సిరీస్ ఏకంగా 240 దేశాల్లో 38 భాషల్లోని సబ్ టైటిల్స్‌తో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. శరత్ మరార్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు.
Victory @VenkyMama garu arrives at the #Thandel Muhurtham Ceremony to bless the team ❤️🔥
Watch live now!
- https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop… pic.twitter.com/xzka2IEDOm
— Geetha Arts (@GeethaArts) December 9, 2023
Also read: Leelavathi: కన్నడ దిగ్గజ నటి లీలావతి కన్నుమూత.. ప్రధాని మోదీ, సీఎం సిద్ధరామయ్య సంతాపం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి