Tiger 3: ‘టైగర్ 3’ నుంచి రాబోతున్న ‘'లేకే ప్రభు కా నామ్' సాంగ్.. 7 అద్భుత‌మైన లుక్స్‌తో మెస్మ‌రైజ్ చేయ‌నున్న క‌త్రినా..

Tiger 3 Movie: సల్మాన్, కత్రినా జంటగా రాబోతున్న మూవీ టైగర్ 3. దసరా కానుకగా ఈ మూవీ నుంచి ‘'లేకే ప్రభు కా నామ్..’ ' అనే సాంగ్ విడుదల కాబోతుంది. ఇందులో కత్రినా కిల్లింగ్ లుక్స్ మెస్మరైజ్ చేయనుందట.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 02:09 PM IST
Tiger 3: ‘టైగర్ 3’ నుంచి రాబోతున్న ‘'లేకే ప్రభు కా నామ్' సాంగ్.. 7 అద్భుత‌మైన లుక్స్‌తో మెస్మ‌రైజ్ చేయ‌నున్న క‌త్రినా..

Tiger 3 Songs: నేటి తరం కుర్రకారు హృద‌యాల‌ను గిలిగింత‌లు పెట్టే హీరోయిన్స్‌లో క‌త్రినా కైఫ్ ఒకరు. అద్భుత‌మైన అందం, అభిన‌యం ఈమె సొంతం. బాలీవుడ్ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘టైగర్ 3’లో కత్రినా జోయా అనే పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు అద‌రిపొయే యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించి మెప్పించ‌ట‌మే కాదు..క‌ను రెప్ప వేయ‌కుండా వావ్ అనిపించేంత అందంతో ఆక‌ట్టుకునేంత ఆక‌ర్ష‌ణీయంగా ఆమె క‌నిపించ‌నుంది. దీనికి అక్టోబ‌ర్ 23న ఈ చిత్రం నుంచి విడుద‌లవుతున్న ‘'లేకే ప్రభు కా నామ్..’ ' పాట ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిల‌వ‌నుంది. 

‘టైగర్ 3’ చిత్రంలో ‘'లేకే ప్రభు కా నామ్'..’ పాట‌లో క‌త్రినా కైఫ్ ఏకంగా ఒక‌ట్రెండు కాదు.. 7 అద్భుత‌మైన లుక్స్‌తో అల‌రించ‌బోతున్నారు. ఆమె ఎంటైర్ కెరీర్‌లో ఈ సాంగ్ వ‌న్ ఆఫ్ ది మోస్ట్ ఫేవ‌రేట్ సాంగ్ గా నిలిచిపోతుంది.  ఈ సంద‌ర్భంగా క‌త్రినా మాట్లాడుతూ ‘‘‘'లేకే ప్రభు కా నామ్'’ విజువ‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ను అలా క‌ట్టిప‌డేస్తుంది. అందుక‌నే నా ఫేవ‌రేట్ సాంగ్స్‌లో ఇదొక‌టి. ట‌ర్కీలోని కాప్ప‌డోసియా ప్రాంతంలో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. మాషాల్లా, స్వాగ్ సే స్వాగ‌త్ పాట‌ల త‌ర్వాత‌ నా ఫేవ‌రేట్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాట‌లో న‌న్ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ పాట‌లో న‌న్ను ఆమె ఏకంగా ఏడు మెస్మ‌రైజింగ్ లుక్స్‌లో చూపించారు. దేనిక‌దే ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. టైగ‌ర్ ఫ్రాంచైజీ నుంచి వ‌చ్చే పాట ఎప్పుడూ చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలుస్తుంది. అదే కోవలో ఈ పాట‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. స‌ల్మాన్ ఖాన్‌గారితో క‌లిసి డాన్స్ చేయ‌టాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఈపాట చిత్రీక‌ర‌ణ‌లో మ‌ర‌చిపోలేని అనుభూతులెన్నో ఉన్నాయి'' అన్నారు. 

శుక్ర‌వారం 'లేకే ప్ర‌భు కా నామ్' పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. క్ష‌ణాల్లోనే అది నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఇక ఫుట్ ట్యాపింగ్ డాన్స్ ట్రాక్ .. స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌కు అలా క‌ళ్లు అప్ప‌గించి చూసేలా చేయ‌నుంది. ఈ పాట‌ను ప్రీత‌మ్ కంపోజ్ చేయ‌గా బెన్నీ ద‌యాల్‌, అనుషా మ‌ణి పాడారు. ఈ పార్టీ సాంగ్ ఈ సీజ‌న్‌లో అంద‌రికీ ఫేవ‌రేట్ సాంగ్‌గా నిలవ‌నుంది. 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News