Mega Power : కొత్త హీరో కోసం కిరణ్ అబ్బవరం.. మెగా పవర్‌ అంటూ సందడి

Mega Power Movie Launch ఉగాది సందర్భంగా కొత్త సినిమాల సందడి మొదలైంది. సినిమా అప్డేట్లతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది. ఉగాది సందర్భంగా మెగా పవర్ అనే కొత్త సినిమా నేడు ప్రారంభం కాగా.. ఈ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మెరిశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 04:46 PM IST
  • టాలీవుడ్‌లో ఉగాది పండుగ స్పెషల్
  • కొత్త సినిమాల ప్రారంభోత్సవం
  • కొత్త హీరో కోసం కిరణ్ అబ్బవరం
Mega Power : కొత్త హీరో కోసం కిరణ్ అబ్బవరం.. మెగా పవర్‌ అంటూ సందడి

Mega Power Movie Launch ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఫుల్ స్పీడు మీదున్నాడు. వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. తాజాగా కొత్త హీరో తీస్తోన్న సినిమా ప్రమోషన్ కోసం ముందుకు వచ్చాడు. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ఆశీసులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా ‘మెగా పవర్‌’ చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. 

ఈ సినిమాలో శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు గేదెల రవిచంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్‌ కొట్టగా.. కిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పృథ్వీరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.

హీరోగా తొలి చిత్రమిదని, లైన్‌ బావుందని హీరో శ్రీ కళ్యాణ్‌ అన్నాడు. కథ మీద బాగా వర్క్‌ చేశామని, తన మీద నమ్మకంతో తన బాబాయ్‌ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిపాడు. హీరోయిన్‌ శశి మాట్లాడుతూ హీరోయిన్‌గా పరిచయానికి చక్కని కథ ఇది అని శశి చెప్పుకొచ్చింది. రవిచంద్ర మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌గారి ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై తొలి చిత్రం ప్రారంభమైందని తెలిపాడు. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని అన్నాడు.

ఈ సినిమాలో థర్టీ ఇయర్స్ పృథ్వీ, రఘుబాబు, మురళీశర్మ, రచ్చ రవి, రియాజ్‌, రెహమాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సురేష్‌, సంగీత, ప్రభావతి వర్మ, కౌశల్య వంటి వారు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇవ్వబోతోన్నారని మేకర్లు తెలిపారు.

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News