Game Changer: ఇది కదా రామ్ చరణ్ క్రేజ్.. ఆ ఏరియాలో భారీ రేటుకు అమ్ముడుపోయిన ‘గేమ్ ఛేంజర్’ హక్కులు..

Game Changer: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఉత్తర భారత దేశం హక్కులను ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 30, 2024, 02:25 AM IST
 Game Changer: ఇది కదా రామ్ చరణ్ క్రేజ్.. ఆ ఏరియాలో భారీ రేటుకు అమ్ముడుపోయిన ‘గేమ్ ఛేంజర్’ హక్కులు..

Game Changer: ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరగింది. ఆ తర్వాత తండ్రి చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘ఆచార్య’ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. ఇపుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చాటాతాడా అనేది చూడాలి. ఇప్పటికే ఎన్టీఆర్ ‘దేవర’ హక్కులను దక్కించుకున్న కరణ్ జోహార్ AA మూవీస్.. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ హక్కులను కూడా కరణ్ జోహార్ aa ఫిల్మ్స్ దక్కించుకుంది. దాదాపు భారీ రేటుకు ఈ సినిమా హక్కులు అమ్ముడు పోయినట్టు సమాచారం.  

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఈ చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దాదాపు రూ. 30 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇది సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్.
జనవరి 10, 2025న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన “జరగండి”, “రా రా మచ్చ” అనే రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశాలున్నాయి.

"గేమ్ ఛేంజర్" ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ మూవీని నార్త్‌లో అనిల్ తడాని AA ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేయబోతోన్నారు. ఉత్తర భారతదేశ పంపిణీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఇక నార్త్‌లో ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఈ సినిమా రామ్ చరణ్.. నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా ..అణగారిన వర్గాల తరుపున పోరాడే ప్రభుత్వాధినేతగా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా స్టోరీ. ఇందులో రామ్ చరణ్.. తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించబోతున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. మొత్తంగా ఈ చిత్రాన్ని ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఉండబోతున్నట్టు సమాచారం. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎడిటింగ్‌ను బాధ్యతను ప్రఖ్యాత ద్వయం షమ్మర్ ముహమ్మద్, రూబెన్ పనిచేస్తున్నారు.

ఈ చిత్రాన్నిహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్‌, న్యూజిలాండ్ తో సహా విభిన్న ప్రదేశాలలో  షూట్ చేసిన "గేమ్ ఛేంజర్" విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన పవర్ ఫుల్ స్టోరీకి శంకర్ తన విజన్‌ను జోడించి భారీ ఎత్తున తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News