Kiran Abbavaram Birthday: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు నేడు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఈ కుర్రాడు తన టాలెంట్‌తో అదరగొడుతున్నాడు. ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో 'వినరో భాగ్యము విష్ణు కథ', మరో రెండు కోడి రామకృష్ణ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో 'నేను మీకు బాగా కావాల్సినవాడిని', మైత్రీ మూవీస్ బ్యానర్‌లో 'మీటర్'. కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి.
కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే వినరో భాగ్యము విష్ణు కథ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన 24 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్‌కి చేరువగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ గ్లింప్స్ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని, కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తిరుపతి యువకుడిగా కనిపించనున్నాడు. గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తున్న 'నా పేరు విష్ణు, మా ఊరు తిరుపతి.. మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ.. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా..!' అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశీ జంటగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
Rising Star #KiranAbbavaram Upcoming Movies !!#HBDKiranAbbavaram pic.twitter.com/yohOhpH7Sm
— Movie Buzz (@TFIMovieBuzz) July 15, 2022
Also Read: Ktr Comments: కాంగ్రెస్, బీజేపీ సర్వేల్లో టీఆర్ఎస్ దే అధికారం! 90 సీట్ల లెక్క చెప్పిన కేటీఆర్..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే.. స్పెషల్ గ్లింప్స్ ఫ్రమ్ "వినరో భాగ్యము విష్ణు కథ"
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు నేడు
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం
రిలీజ్‌కు సిద్ధమవుతున్న 3 సినిమాలు