Chhaava 9th Box office Collecions: 9వ రోజు అన్ని రికార్డ్స్ ఔట్.. ఛావా దెబ్బకు ఎరుపెక్కిన బాక్సాఫీస్..

Chhaava Movie 9th day Box office Collecions: విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా.. అక్షయ్ ఖన్నా మరో లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘ఛావా’. ఔట్ అండ్ ఔట్ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను చెరిపేస్తూ దూసుకుపోతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 23, 2025, 12:38 PM IST
Chhaava 9th Box office Collecions: 9వ రోజు అన్ని రికార్డ్స్ ఔట్.. ఛావా దెబ్బకు ఎరుపెక్కిన బాక్సాఫీస్..

Chhaava Movie 9th day Box office Collecions: ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన  నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. ఏసు బాయి పాత్రలో  రష్మిక మందన్న నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది.   అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయాడు.  ఫిబ్రవరి 14న  ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం 9వ రోజు కూడా అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు సెకండ్ హైయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రెండో శనివారం 9వ రోజు..రూ. 44.10 కోట్ల నెట్ వసూల్లతో దుమ్ము దులిపింది.

పెద్దగా స్టార్ క్యాస్ట్ లేని.. మల్టీస్టారర్ కానీ ఈ సినిమా స్టోరీనే హీరోగా ప్రేక్షకులు  ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.  ‘ఛావా’ మూవీలో  విక్కీ కౌశల్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. విక్కీ కౌశల్ సినీ జీవితం ‘ఛావా’ కంటే ముందు తర్వాత అనే  చెప్పాలి. కానీ ‘ఛావా’ రిలీజ్ తర్వాత  విక్కీ కౌశల్ పేరు భారతీయ బాక్సాఫీస్ దగ్గర మారు మోగిపోతుంది.  

ముఖ్యంగా గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో యాంటీ హిందూ సినిమాలు తెరకెక్కించడమే ఎజెండా ఉండేది. కానీ రాను రాను ప్రో హిందూ నేషనలిజమ్ నేపథ్యంలో సినిమాలు నిర్మిస్తున్నారు. మన భారతీయ విలువలు.. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో  కూడిన  అడుగులు వేస్తున్నారు. కేవలం స్టోరీని నమ్ముకొని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పూటకో రికార్డును స్మాష్ చేస్తూ పోతుంది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ముఖ్యంగా చావా సినిమా 2025లో జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు నేషనల్ బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని అవార్డులు ఛావాకు  వచ్చి తీరాల్సిందే అని క్రిటిక్స్ నొక్కి వక్కాణిస్తున్నారు.  ఈ సినిమాలో  ఏసుబాయ్ పాత్రలో రష్మిక మందన్న యాక్టింగ్ సలామ్ కొట్టాల్సిందే. అటు ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా తన విలనిజం చూపించాడు.  మొత్తంగా తన విలనిజంతో హీరో పాత్రకు మంచి పేరు తీసుకొచ్చాడు.

ఈ సినిమా త్వరలో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడం గ్యారంటీ అని చెప్పాలి. ముందు ముందు ‘ఛావా’ సినిమా  ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News