Boney Kapoor: స్టార్ హీరోయిన్ తో నిర్మాత అసభ్య ప్రవర్తన.. ఏకంగా అక్కడ చెయ్యి వేసి!

Priyamani::బాలీవుడ్ ప్రొడ్యూసర్, దివంగత నటి శ్రీదేవి భర్త బోనికపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కాగా ఈ నిర్మాత ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ పట్ల ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 11, 2024, 09:36 AM IST
Boney Kapoor: స్టార్ హీరోయిన్ తో నిర్మాత అసభ్య ప్రవర్తన.. ఏకంగా అక్కడ చెయ్యి వేసి!

Boney Kapoor -Priyamani: ప్రియమణి తెలుగువారికి బాగా సుపరిచితురాలే. కాగా ఈ హీరోయిన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించి బాలీవుడ్ లో సైతం మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమా తరువాత నుంచి ప్రియమణికి హిందీలో కూడా సినిమా ఆఫర్లు అలానే వెబ్ సిరీస్ ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్యనే అజయ్ దేవగన్ మైదాన్ సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది ప్రియమణి.

తాజాగా విడుదలైన ఈ సినిమా చూసేందుకు మైదాన్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్‌ నిన్న రాత్రి థియేటర్‌కు వచ్చారు. ఇందులో భాగంగా హీరోయిన్ ప్రియమణితో కలిసి ఈ నిర్మాత ఫోటోలకు పోజులిచ్చారు. కానీ ఆ ఫోటోలు తీసుకునే సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలు విషయం ఏమిటి అంటే ఈ ఫోటోలలో ప్రియమణి నడుముపై చేతులు వేస్తూ కనిపించారు బోనీ కపూర్. అంతే కాకుండా ఎలా పడితే అలా తాకుతూ ప్రియమణిని కొంచెం ఇబ్బందికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో.. ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ ఫైరవుతున్నారు. 68 ఏళ్ల వయసులో ఉన్న నిర్మాత.. అలానే ఇద్దరు కూతుర్లు గల ఆయన.. ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా తప్పు అని కామెంట్లు.

ఒక నెటిజన్ రాస్తూ.. "సినిమా వారికి బాగా తెలిసిన ప్రియమణితో ఇలా ప్రవర్తించడం అస్సలు బాగాలేదు. ఇక రాబోయే నటీమణులతో బోనీ ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించలేకపోతున్నా"అంటూ రాసుకొచ్చారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ..' మీకు ఇద్దరు కుమార్తెలు.. జాన్వి కపూర్.. ఖుషి కపూర్.. ఉన్నారని గుర్తుంచుకోండి. ఇలా ప్రవర్తించడం చాలా అవమానకరంగా ఉంది' అని పోస్ట్ చేశారు. 

 

అయితే బోనీకపూర్ హీరోయిన్ తో ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రనిర్మాత జిగి హడిద్ బేర్ నడుముపై కూడా చేతులు వేస్తూ అప్పట్లో ఫోటోలు తీసుకున్నారు. అంతేకాకుండా ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్లో ఊర్వశి రౌతేలాతోనూ అలాగే ప్రవర్తించారు. ప్రస్తుతం గతంలో జరిగిన ఈ సంఘటనలన కూడా తీసి మరి తిడుతున్నారు నేతిజన్స్. ఇప్పటికన్నా ఈ నిర్మాత ప్రవర్తన తీరు మార్చుకోకపోతే ముందు ముందు అది మంచిది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News